Betel leaves : తమలపాకులతో జుట్టు సమస్యలకు చెక్!
తమలపాకులను కేవలం శుభకార్యాలయకే వాడతారు అనుకుంటే పొరపాటే. వీటిని పండుగలు, పెళ్లిళ్లు, వేడుకల్లో తమలపాకులను భగవంతుని గౌరవ సూచికంగా సమర్పిస్తారు. భోజనం చేసిన తర్వాత తమలపాకులను తీసుకుంటారు. అయితే జుట్టు సమస్యలకు తమల పాలకులు దివ్య ఔషధంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడం, వాల్యూమ్ కోల్పోవడం, చుండ్రు సమస్య వంటి వివిధ సమస్యలను పరిష్కరించడంలో తమలపాకులు సాయపడతాయి. జుట్టు పెరుగుదలకు తమలపాకు దోహదపడుతుంది. ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమలపాకుల్లో విటమిన్లు, మినరల్స్ ఉన్నందున జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇక వీటిలో విటమన్ సి అధికంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యకరమైన జుట్టు ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
తమలపాకులో పుష్కలంగా విటమన్లు
తమలపాకులో A, B1, B2, C విటమిన్లతో పాటు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బ్యాక్టరీయా పెరుగుదలను నిరోధించడం ద్వారా జట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుంది. వీటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. 4-5 తమలపాకులు, కొబ్బరి నూనె 1-2 టేబుల్ స్పూన్లు, 1 టీస్పూన్ కాస్టర్ ఆయిల్ తీసుకోవాలి. తమలపాకులను గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఒక గిన్నెలో పేస్ట్, కొబ్బరి నూనె, కాస్టర్ ఆయిల్ కొంచెం నీటితో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు బాగా పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి తర్వాత షాంపూతో కడగాలి.