Children's Day 2024: పిల్లల దినోత్సవం రోజున మీ పిల్లలు సరదాగా సమయాన్ని గడిపే బెస్ట్ ఐడియాస్ మీకోసం..!
భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని, ప్రతి సంవత్సరం నవంబర్ 14 న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. జవహర్‌లాల్ నెహ్రూని, చాచా నెహ్రూ అని కూడా పిలుస్తారు. నెహ్రూని పిల్లలను చాలా ఇష్టపడేవారు. బాలల దినోత్సవానికి జరుపుకోవడానికి పాఠశాలలు, కళాశాలలు, సంస్థలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. తల్లిదండ్రులు ఈ రోజున పిల్లల్ని ఆక్టివ్ గా ఉంచాలంటే ఈ టిప్స్ బాగా హెల్ప్ అవుతాయి. మీ పిల్లలతో ఆనందంగా గడపచ్చు పైగా ఫోన్ తో సమయాన్ని స్పెండ్ చేయరు. మరి ఇక చక్కగా పిల్లలతో సమయాన్ని స్పెండ్ చేయడానికి మార్గాలని చూసేద్దాం..
సరదాగా బయటికి తీసుకువెళ్లండి
మీ దగ్గరలో ఉన్న పర్యాటక ప్రదేశాలు లేదా ప్రకృతితో సంబంధం ఉన్న ప్రాంతాలను పిల్లలతో కలిసి సందర్శించండి. పంట పొలాలు, పార్కులు, జూ లేదా పక్షులు ఉండే ప్రదేశాలు చూడడం వాళ్లకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ దృశ్యాలు పిల్లలకి హాయిని కలిగిస్తాయి. #2ఫోటోషూట్ చేయండి మీ పిల్లలకు ఇష్టమైన సూపర్ హీరో నుండి వారి ఇష్టమైన కార్టూన్ పాత్ర వరకు ఏదైనా థీమ్ ను ఎంచుకోండి. వారికీ ఆ దుస్తులు ధరింపజేసి, ఆపై ఫోటోను క్లిక్ మనిపించండి. ఫోటోగ్రాఫ్‌లతో వారి గదిని అలంకరించండి.
పిల్లలతో వంట చేయడం
చిన్న వంటకాలను పిల్లలతో కలిసి చేయడం వారికి ఆహారానికి సంబంధించిన అంశాలను నేర్పిస్తుంది. అయితే, పొయ్యి జాగ్రత్తగా ఉపయోగించాలి. పిల్లలకు దేనికైనా సహాయం చేయించడం వారి స్వీయ అభివృద్ధికి దోహదం చేస్తుంది. #4ఇంట్లో గార్డెనింగ్ చేయండి పాత కప్పులు, ప్లాస్టిక్ కప్పులు, గ్లాసులలో మొక్కలు నాటడం ఒక మంచి అభ్యాసం. మీ పిల్లలతో కలిసి ఈ కార్యకలాపంలో భాగస్వాములు కావడం వారికి కొత్త విషయాలు నేర్పే అవకాశం ఇస్తుంది. #5కార్డ్ గేమ్స్, బోర్డు గేమ్స్ ఇంటి గేమ్స్ లేదా బోర్డు గేమ్స్ (ఉదా: యునో, కార్డ్స్, స్క్రాబుల్) ఆడటం సరదాగా ఉంటుంది. అలాగే, మీకు సరదాగా గేమ్స్ ఆడటం వల్ల పిల్లలకు కూడా దానిలో ఆనందం వస్తుంది.