
Children's Day Special: దేశంలో అతిపిన్న వయస్కులైన సీఈఓలు వీరే.. 10ఏళ్లకే అద్భుతం చేశారు
ఈ వార్తాకథనం ఏంటి
నేడు బాలల దినోత్సవం. నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశంలో నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం.
ఈ బాలల దినోత్సవం సందర్భంగా అతిపిన్న వయస్సులోనే టెక్నాలజీ రంగంలో ఖ్యాతిని గడించిన ఇద్దరు అన్నాదమ్ముల విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం.
చెన్నైకి చెందిన శ్రవణ్, సంజయ్ కుమారన్ 2011లో గో డైమెన్షన్(GoDimensions) అనే ఐటీ సంస్థను తమ ఇంట్లోనే స్థాపించారు.
అప్పుడు శ్రవణ్‌కు 8ఏళ్లు, సంజయ్‌కు 10ఏళ్లు. సంజయ్ సీఈవో, శ్రవణ్ అధ్యక్షుడిగా సంస్థ బాధ్యతలు చేపట్టారు.
ఆ తర్వాత ఈ ఇద్దరు అన్నదమ్ములు కేవలం రెండేళ్ల కాలంలోనే ఏకంగా ఏడు మొబైల్ యాప్‌లను ఆవిష్కరించారు.
అవి 50కి పైగా దేశాల్లో ప్రాచుర్యం పొందాయి. వేలాది మంది డౌన్‌లోడ్‌లు చేసుకున్నారు.
బాలలు
తండ్రి ప్రోత్సాహంతోనే..
శ్రవణ్, సంజయ్ కుమారన్‍ను భారతదేశంలోనే అత్యంత పిన్న వయస్కులైన యాప్ డెవలపర్‌లు, సీఈఓలుగా గుర్తిస్తూ.. 'ఫోర్బ్స్ అండర్ 30' జాబితాలో వీరికి చోటు లభించింది.
దీంతో అప్పట్లో వీరి పేరు దేశం మొత్తం మారుమోగింది. ఈ చిన్నారులు చిచ్చరపిడుగులు అంటూ పెద్ద ఎత్తు మీడియా పొడిగింది.
ఆ తర్వాత ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎందరో చిన్నారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.అనంతరం వీరి బాటలో ఎందరో నడిచారు, విజయం సాధించారు.
శ్రవణ్, సంజయ్ యాప్ డెవలపర్లుగా మారడానికి, వారికి ప్రోగ్రామింగ్ పట్ల మక్కువను పెంచడంలో వారి తండ్రి కుమారన్ సురేంద్రన్ పాత్ర ఉంది.
ఇద్దరికి కంప్యూటర్‌పై ఉన్న మక్కున దృష్టిని పెట్టుకొని సాఫ్ట్‌వేర్ అయిన సురేంద్రన్ వారికి ప్రోగ్రామింగ్ నేర్పించారు.
బాలల
శ్రవణ్, సంజయ్ రూపొందించిన 'క్యాచ్ మీ కాప్' యాప్ అప్పట్లో సంచలనం
శ్రవణ్, సంజయ్ ఇద్దరూ కూడా తండ్రి ఇచ్చిన ప్రేరణకు తమ నైపుణాలను జోడించి యాప్‌లను డెవలప్ చేశారు.
శ్రవణ్, సంజయ్ సృష్టించిన మొదటి యాప్ 'క్యాచ్ మీ కాప్'. ఇది చిన్నారుల గేమింగ్ యాప్ అప్పట్లో సంచలనం అని చెప్పాలి.
'చోర్-పోలీస్' ఆధారంగా ఈ గేమింగ్ యాప్‌ను తయారు చేశారు. తర్వాత చైల్డ్ ఎడ్యుకేషన్ యాప్‌లను కూడా వీరు తయారు చేశారు.
అలాగే వీరద్దరూ 150 టెస్ట్ యాప్‌లను కూడా అభివృద్ధి చేశారు.
ప్రస్తుతం శ్రవణ్, సంజయ్ ఇద్దరూ అమెరికాలోని టెక్సాస్ A&M విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ డిగ్రీలను పొందారు.
శ్రవణ్ ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో సేల్స్‌ఫోర్స్ కోసం సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తుండగా.. సంజయ్ మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇంటర్న్‌గా చేస్తున్నారు.