LOADING...
Christmas special: నోరూరించే చ్లాకెట్ స్పాంజ్ కేక్.. ఓవెన్ లేకుండానే అప్పటికప్పుడు రెడీ!
నోరూరించే చ్లాకెట్ స్పాంజ్ కేక్.. ఓవెన్ లేకుండానే అప్పటికప్పుడు రెడీ!

Christmas special: నోరూరించే చ్లాకెట్ స్పాంజ్ కేక్.. ఓవెన్ లేకుండానే అప్పటికప్పుడు రెడీ!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ ఉత్సవాల వరకు కేక్ పట్ల చిన్నారులు,పెద్దలు అందరూ విపరీతమైన క్రేజ్ చూపిస్తారు. స్నేహితులు,బంధువులు కలసి కేక్ కటింగ్ చేసుకుంటూ ఉత్సవాన్ని మరింత ఉల్లాసంగా మార్చుతారు. అయితే,కేక్ కావాలంటే ఎక్కువమంది సాధారణంగా దగ్గరలోని బేకరీల వైపు పరుగెత్తుతారు. కానీ, మీకు తెలుసా? ఇంట్లోనే తక్షణమే చాక్లెట్ కేక్ తయారు చేయవచ్చు. అదీ, ఓవెన్ లేకుండా! కేవలం ఇంట్లోని సాధారణ కేక్ టిన్ లేదా గిన్నెతో సులభంగా ఈ కేక్ తయారు చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో తయారు చేస్తే, ఇంటి పిల్లలతో పాటు పెద్దలు కూడా "వన్స్ మోర్!" అంటూ పరిగెత్తుతారు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ సూపర్ టేస్టీ చాక్లెట్ కేక్ కోసం కావాల్సిన పదార్థాలు చూద్దాం.

వివరాలు 

కావలసిన పదార్థాలు:

మైదా పిండి - 3/4 కప్పు కోకో పౌడర్ - 1/4 కప్పు బేకింగ్ పౌడర్ - 1 టీ స్పూన్ బేకింగ్ సోడా - 1/2 టీ స్పూన్ పంచదార - 3/4 కప్పు కోడిగుడ్లు - 3 ఉప్పు - చిటికెడు బటర్ (వెన్న) - 3/4 కప్పు నిమ్మరసం - 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ - 1 టీ స్పూన్

వివరాలు 

తయారీ విధానం:

1. లోతైన గిన్నె తీసుకొని కాస్త ఆయిల్ రాసి, పైకి బటర్ పేపర్ పెట్టి మళ్లీ తక్కువ ఆయిల్ తురుమాలి. 2. మరోవైపు మిక్సింగ్ బౌల్లో మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. 3. మరో బౌల్లో పంచదార, కోడిగుడ్లు,చిటికెడు ఉప్పు, కరిగించిన బటర్,నిమ్మరసం,వెనిలా ఎసెన్స్ వేసి గ్రైండ్ చేయాలి. 4. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గోధుమపిండి-కోకో పౌడర్ మిశ్రమంలో వేసి బాగా కలిపితే కేక్ బ్యాటర్ సిద్ధం అవుతుంది.

Advertisement

వివరాలు 

తయారీ విధానం:

5. గిన్నెలో ఆ బ్యాటర్ వేసి స్టవ్‌పై పెట్టి, దొడ్డు ఉప్పు వేసి, మూతపెట్టి 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేయాలి. 6. 5 నిమిషాల తర్వాత, కేక్‌ ఉన్న గిన్నెను స్టవ్‌లో పెట్టి 45 నిమిషాలపాటు బేక్ చేయాలి. 7. 45 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, కేక్ చల్లారిన తరువాత డీమౌల్డ్ చేసుకోవాలి. ఇక అంతే చాక్లెట్ కేక్ రెడీ అయినట్లే! ఇంట్లో తయారు చేసిన కేక్‌ను చూసి పిల్లలు, పెద్దలు అందరూ ఆనందంతో తింటారు.

Advertisement