Christmas Gifts: క్రిస్మస్ పండుగకి బెస్ట్ గిఫ్ట్ కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి!
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు సందడి చేస్తున్నాయి. ఈ సందర్భంగా సాంటాక్లాజ్, బహుమతులు, శుభాకాంక్షలు మనందరికీ గుర్తుకువస్తాయి. ప్రతి సంవత్సరం, మనం తమకు ఇష్టమైన వారికి గిఫ్ట్‌లు ఇచ్చి, వారిని సర్‌ప్రైజ్ చేసే ఆనవాయితీని కొనసాగిస్తాం. మీరు కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా కరువైన గిఫ్ట్ విషయాలు ఆలోచిస్తున్నారా? అయితే, మీ కోసం కొన్ని ప్రత్యేకమైన గిఫ్ట్ ఆఫర్లు అందిస్తున్నాం. అవి ఎక్కడ లభిస్తాయి, ధర ఎంత, ఇతర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మటాంచెరీ ప్లమ్ కేక్
క్రిస్మస్ వేడుకల్లో కేక్ ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అందుకే, రొటీన్‌గా కాకుండా, ప్రత్యేకమైన ఫ్లేవర్స్‌తో కేక్ బహుమతిగా ఇవ్వడం మరింత బాగుంటుంది. ఆరోగ్యకరమైన, రుచికరమైన కేకులను డ్రైఫ్రూట్స్, షుగర్ లెస్, ఎగ్‌లెస్ వంటి ఫ్లేవర్స్‌లో రుచిచూసే అవకాశం ఉంటుంది. 'పందల్' వంటి ప్రఖ్యాత బేకరీలలో మటాంచెరీ ప్లమ్ కేక్ అందుబాటులో ఉంది. ఈ కేక్ ధర రూ.1,380,అదనంగా రూ.6,000 విలువ చేసే హాలిడే హాంపర్ కూడా అందిస్తున్నారు. అలాగే, 'బేకర్స్ డజన్' వారు ప్రత్యేక క్రిస్మస్ ప్లమ్ కేక్‌ను రూ.495 నుంచి అందిస్తున్నారు.
యువతీయువకుల కోసం 'డిప్టిక్' వారి హాలిడే ఎడిషన్లు
మహిళలకు బహుమతిగా 'సాట్‌బెల్లా' బ్రాండ్ నుండి పింక్ కలర్‌లో స్ట్రాప్‌లెస్ డ్రెస్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ డ్రెస్ ధర రూ.5,999 కాగా, సాయంత్రం జరిగే ప్రత్యేక పార్టీలకు ఇది బాగా సరిపోతుంది. అలాగే, యువతీయువకుల కోసం 'డిప్టిక్' వారి హాలిడే ఎడిషన్లు.'ఫ్లూర్ డీ పూ' (రూ.17,300), 'డూ సన్' (రూ.17,300) వంటి ప్రత్యేక పెర్‌ఫ్యూమ్‌లు మంచి ఆప్షన్లు. మహిళలకు ఖుస్సా డిజైన్‌తో హ్యాండ్‌బ్యాగ్ లేదా చెవి రింగులు బహుమతిగా ఇవ్వాలనుకుంటే,'గ్రీన్ పార్టీ వేర్ హ్యాండ్‌బ్యాగ్' (రూ.8,999) లేదా 'గోల్డెన్ బై రీ ఇయర్‌రింగ్స్' (రూ.999) మంచి ఎంపికలు. ఆడవారికి బహుమతిగా 'ఖోయా' స్వీట్లు,ప్రత్యేకంగా జీడిపప్పు,కోకోనట్ బార్స్, సత్తు పేడా వంటి వింటర్ స్వీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆరు పీస్‌ల బాక్స్ ధర రూ.1,500.
'ఫ్రేజర్ అండ్ హాస్' వారి ప్రత్యేక క్యాండిల్ స్టాండ్ 'ఆర్కిటిక్'
క్రిస్మస్ వేడుకలు క్యాండిల్స్‌తో మరింత ప్రత్యేకంగా ఉంటాయి. 'ఫ్రేజర్ అండ్ హాస్' వారి ప్రత్యేక క్యాండిల్ స్టాండ్ 'ఆర్కిటిక్' (రూ.8,500) 'ప్లాటర్ ఆర్కిటిక్' (రూ.23,700) బహుమతిగా ఇవ్వవచ్చు. అదే విధంగా, 'జస్ట్ కావల్లి'వారి ప్రత్యేక వాచ్ 'పెల్లె సోలో విమెన్ వాచ్' (రూ.21,500) సరైన ఎంపిక. సోల్‌ఫ్లవర్ వారి శాంటా సర్‌ప్రైజ్ గిఫ్ట్ బాక్స్‌లో ఉండే పర్సనల్ కేర్ ఉత్పత్తులు. 'ఆసిక్స్' జెల్-కయానో 31 షూస్ (రూ.16,000) 'ఆర్య వైద్య స్కిన్‌కేర్' ఉత్పత్తులు, సహజమైన సౌందర్యానికి పర్ఫెక్ట్ గా ఉంటాయి. 'ఊర్జా బై జరీన్' వారి అద్భుతమైన ఆభరణాలను కూడా క్రిస్మస్ సందర్భంగా బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ క్రిస్మస్‌కి మీరు మీ ప్రియమైన వారికి ఇవ్వగలిగే కొన్ని అద్భుతమైన గిఫ్ట్ ఐడియాలు ఇవే!