Santa Claus: ఎవరు ఈ శాంటా క్లాజ్.. ఎరుపు, తెలుపు థీమ్ వెనుక కథ
ఈ వార్తాకథనం ఏంటి
క్రిస్మస్ వచ్చిందంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఎరుపు రంగు దుస్తులు ధరించిన, తెల్లటి గడ్డం గల శాంటా క్లాజ్. కానీ, ఆలోచించారా, ఈ శాంటా ఎప్పుడూ ఎరుపులోనే ఎందుకు కనిపిస్తాడు? క్రిస్మస్ థీమ్ ఎరుపు, తెలుపు రంగుల్లో ఎందుకు ఉంటుందో తెలుసుకోవాలంటే, దానికి సంబంధించిన ఆసక్తికరమైన కథని తెలుసుకోవాలి. వాస్తవానికి, దీని వెనుక ఒకటే కాదు, అనేక చారిత్రక కథలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు చూద్దాం.
వివరాలు
శాంటా క్లాజ్ ఎవరు..?
శాంటా అసలు పేరు సెయింట్ నికోలస్. ప్రచార కథనం ప్రకారం, సెయింట్ నికోలస్ నాల్గవ శతాబ్దంలో టర్కీలోని మైరా ప్రాంతంలో జీవించాడు. గొప్ప ఇంట్లో పుట్టినప్పటికీ, చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందటంతో అనాథయ్యాడు. అలా పెరిగిన ఆయన పేదల పట్ల ఎక్కువ ప్రేమను పెంచుకున్నాడు. పేదలకు బహుమతులు ఇవ్వడం అతనికి చాలా ఇష్టం. అందుకే, పేదలకు ఎవరికీ తెలియకుండా, రహస్యంగా బహుమతులు ఇవ్వడం అతనికి అలవాటు అయింది. నిజానికి, సెయింట్ నికోలస్ ఒక బిషప్. ఎవరికీ తెలియకుండా ఎప్పుడు సాక్సులో గిఫ్టులు పెట్టి ఇవ్వడం శాంటాకు అలవాటు.
వివరాలు
శాంటా క్లాజ్ అనే పేరు ఎలా వచ్చింది?
సెయింట్ నికోలస్ పేరు తర్వాత శాంటా క్లాజ్గా మారింది. ఒకసారి, నికోలస్ ఒక పేద కుటుంబాన్ని చూశాడు. ఆ కుటుంబానికి ముగ్గురు కుమార్తెలు ఉండగా, వారిని వివాహం చేయడానికి తల్లిదండ్రికి డబ్బు లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. నికోలస్ వారికి రహస్యంగా సాయం చేయాలని నిర్ణయించాడు. అతను బంగారు నాణాలను సాక్స్‌లో ఉంచి కిటికీ ద్వారా ఇంట్లోకి పంపించేవాడు. మొదట పెద్ద కుమార్తె వివాహం జరిగింది. తర్వాత మరిన్ని సమయాల్లో కూడా ఇలా సహాయం చేయడంతో, ముగ్గురికి వివాహం జరుగుతుంది. అయితే, చివరకు ఆ పేద వ్యక్తి ఈ సహాయం నికోలస్ చేసినట్లు తెలుసుకున్నాడు. అతని ద్వారా చివరకు ఊరు ఊరంతా తెలిసిపోతుంది.
వివరాలు
కోకా-కోలా రోల్:
ఇంతకీ, శాంటా క్రిస్మస్ రోజున పిల్లలకు గిఫ్ట్‌లు ఇవ్వడం ప్రారంభమైంది. శాంటా క్లాజ్‌ని ఫాదర్ క్రిస్మస్,ఓల్డ్ మ్యాన్ క్రిస్మస్ అని కూడా పిలుస్తారు. 1823లో క్లెమెంట్ క్లార్క్ మూర్ రాసిన "ట్వాస్ ది నైట్ బిఫోర్ క్రిస్మస్" కవిత,శాంటాను పిల్లలకు గిఫ్ట్‌లు తేవించే సంతోషకర, బలమైన వృద్ధుడిగా చిత్రీకరించింది. ఇక్కడే నేటి శాంటా క్లాజ్ చిత్రం ఏర్పడింది అని చెబుతారు. అనేక మంది నమ్మే విధంగా, శాంటా ఎరుపు దుస్తులు కోకా-కోలా సృష్టించిందని కూడా చెబుతారు. వాస్తవానికి, 1930లలో కోకా-కోలా తన ప్రకటనల్లో శాంటాను ఎరుపు, తెలుపు దుస్తుల్లో చూపించింది. ఈ రూపాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసింది.అయితే, కోకా-కోలా శాంటాను సృష్టించలేదు; కానీ, వారి యాడ్ తర్వాత శాంటా మరింత ప్రసిద్ధి చెందాడు.
వివరాలు
నేటి శాంటా
నేడు శాంటా క్లాజ్ సినిమాలు, కార్టూన్లు, ప్రకటనలలో అంతర్భాగంగా మారింది. శాంతా క్లాజ్ మొదటిసారి 1912లో ఒక సినిమాలో కనిపించింది. ఆ తర్వాత వచ్చిన ఎల్ఫ్, ది శాంటా క్లాజ్, మిరాకిల్ ఆన్ 34త్ స్ట్రీట్ వంటి సినిమాలు శాంటాను మరింత ప్రాచుర్యం పొందేలా చేశాయి.