Cinnamon Water Benefits: ఆరోగ్యంగా గుండె, కొలెస్ట్రాల్ కంట్రోల్.. దాల్చిన చెక్క నీటితో ప్రయోజనాలెన్నో
ఈ వార్తాకథనం ఏంటి
అందరూ దాల్చిన చెక్కను మసాలా దినుసుగానే భావిస్తారు. కానీ, దానిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు.
మెగ్నీషియం, ఇనుము, భాస్వరం, ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, లైకోపీన్ వంటి మూలకాలు ఎన్నో దాల్చినచెక్కలో ఉంటాయి. ఈ మూలకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
వంటల్లో వేసే కంటే.. దాల్చిన చెక్క ను మరిగించి ఆ నీటిని రోజూ ఖాళీ కడుపుతో తీసుకోవడం మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుుతున్నారు.
జీర్ణక్రియ సమస్యలకు చెక్
దాల్చినచెక్కలో సహజమైన జీర్ణక్రియ లక్షణాలు ఉన్నాయి. గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం సమస్యలను తగ్గిస్తుంది.
గుండెకు మేలు
దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణను మెరగవుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు, గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడుతుంది.
దాల్చిన చెక్క
రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది
దాల్చినచెక్కలో యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, సాధారణ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.
దీర్ఘకాలిక వ్యాధులు దూరం
దాల్చినచెక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
జ్ఞాపకశక్తి మెరుగుదల
దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వయస్సు-సంబంధిత న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడవచ్చు.