చర్మాన్ని సురక్షితంగా ఉంచే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే ఆహారాలు
మానవ శరీర నిర్మాణం సక్రమంగా జరగడానికి కొల్లాజెన్ ఎంతో సాయపడుతుంది. ఇదొక ప్రొటీన్. దీనివల్ల చర్మం సురక్షితంగా, యవ్వనంగా, మృదువుగా ఉంటుంది. అంతేకాదు కీళ్ళ మధ్య మృదులాస్థిని ఆరోగ్యంగా ఉంచుతుంది. దానివల్ల ఎముకల జాయింట్లు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మరి కొల్లాజెన్ ప్రొటీన్ లభించే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కూరగాయలు: విటమిన్ సి, క్లోరోఫిల్ కలిగిన కలిగిన పాలకూర, బచ్చలికూర మొదలగు వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిలో ఉపయోగపడతాయి. కూర మిరప (ఎరుపు రంగు) లో కూడా కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరమయ్యే పోషకాలు ఉంటాయి. పండ్లు: విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్ లో వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. జామ, నారింజ, బెర్రీస్ తినాలి.
కొల్లాజెన్ ఉత్పత్తి చేసే ఇతర ఆహారాలు
లైకోపీన్ అనే పోషకాన్ని కలిగి ఉండే టమాట, ద్రాక్ష మొదలగునవి చర్మానికి సంబంధించిన ప్రొటీన్ కొల్లాజెన్ ఉత్పత్తిలో సాయం చేస్తాయి. నారింజ, నిమ్మ, అరటి పళ్ళను కూడా మీ డైట్ లో చేర్చుకోండి. పప్పులు, చిక్కుళ్ళు: వీటిలో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ని తయారు చేస్తాయి. ఇంకా పప్పుల్లో విటమిన్ సి, జింక్, కాపర్ లాంటి చర్మాన్ని సంరక్షించే పోషకాలు ఉంటాయి. సోయా చిక్కుడు, శనగలు, చిక్కుడు కాయ మొదలగునవి ఎముకల కీళ్ళను బలంగా తయారు చేస్తాయి. గింజలు, విత్తనాలు: మన శరీరం దానికదే తయారు చేసుకోలేని అమైనో ఆమ్లాలు గింజలు, విత్తనాల్లో ఉంటాయి. బాదం, కాజు, వేరుశనగ, సూర్యపువ్వు విత్తనాలు మొదలగు వాటిని ఆహారంలో చేర్చుకోండి.