
Avoid These Combo : ఈ 5 ఆహారాలను కలిపి తింటే అంతే సంగతులు
ఈ వార్తాకథనం ఏంటి
శరీరానికి కావాల్సిన శక్తి ఆహార పదర్థాల ద్వారానే సమకూరుతుంది. అలాంటి ఆహారం సరైన రీతిలో తీసుకుంటేనే తిన్నది సరిగ్గా జీర్ణం అవుతుంది.
అయితే పలురకాల ఆహారాలను కలిపి తీసుకుంటే శరీరానికి అసౌకర్యం. దీంతో పాటు అనారోగ్యమని పోషక ఆహార నిపుణులు చెబుతుంటారు.
నారింజ, నిమ్మ లాంటి సిట్రస్ పండ్లలో యాసిడ్ అధిక స్థాయిలో ఉంటుంది. దీంతో పలు రకాల పదార్థాలను కలిపి తీసుకుంటే ఆరోగ్య దెబ్బతింటుందని నిపుణలు చెబుతున్నారు.
ఈ ఫుడ్ కాంబోకు గుడ్ బై చెప్పాలి :
1. పండ్లను ఉదయం పూట అల్పాహారంగా విడిగా తీసుకోవాలి.ఆహారం, పండ్లు తీసుకునే సమయంలో రెండింటి మధ్య తగిన గ్యాప్ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసిన గంటకు పండ్లు తినటం బెస్ట్.
details
తక్కువ కొవ్వులు కలిగిన మాంసాన్నే తినేందుకు ఎంచుకోవాలి
2. కొవ్వు కలిగిన మాంసంతో, వెన్నె తీసుకుంటే సంతృప్త కొవ్వు, సోడియం స్థాయిలు అధికంగా పెరుగుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని రెట్టిస్తుంది.
ఫలితంగా మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఆహారాన్ని సమతుల్యం చేయడానికి తక్కువ కొవ్వులు కలిగిన మాంసాన్నే తినేందుకు ఎంచుకోవాలి.
3. సిట్రస్ పండ్లు - నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. పాలతో పాటు ఈ పండ్లు కలిపి తింటే, పాలు గడ్డకట్టి జీర్ణ సమస్యలు మొదలవుతాయి.
అందుకే వీటిని తీసుకునే విషయంలో తగినంత గ్యాప్ ఇవ్వాలి.
details
ఈ రెండు కలిపి తిన్నప్పుడు, శరీరం ఈ రెండు పోషకాలను ఏకకాలంలో గ్రహించలేదు
4. ఐరన్ సహా కాల్షియం మనిషి శరీరానికి కావాల్సిన కంపల్సరీ మినరల్స్. అయితే ఈ రెండు కలిపి తిన్నప్పుడు, శరీరం ఈ రెండు పోషకాలను ఏకకాలంలో గ్రహించలేదు.
అలా కాకుండా ఈ రెండింటినీ బాగా గ్రహించాలంటే విటమిన్ 'C'తో ఐరన్, విటమిన్ డితో కాల్షియం కలిసి ఉన్న ఆహారాలనే స్వీకరించాలి.
5. చేపలతో పాలు మాంసాహారంతో పాలు, అనుబంధ ఉత్పత్తులను కలిపి తీసుకోవడం మంచిది కాదు. పాలతో మాంసాన్ని కలపడం శరీరానికి చాలా హానికరమని ఆహార నిపుణలు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి ఆహారా విధానాలు కొన్నిసార్లు అనుకోని ఉపద్రవాలను తెచ్చిపెడతాయి. ఫలితంగా మానవ దేహాన్ని ఆరోగ్య సంక్షోభంలోకి నెట్టెస్తాయి.
అందువల్ల ఆయా కాంబోలను తినకపోవడమే ఉత్తమమని పేర్కొన్నారు.