Christmas Gift Ideas: క్రిస్మస్ గిఫ్ట్ విషయంలో కన్ఫ్యూజనా? ఫ్రెండ్స్, ఫ్యామిలీకి బెస్ట్ ఐడియాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల కాలంలో మతభేదాలకు అతీతంగా అందరూ కలిసి ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, మనకు ఇష్టమైన వాళ్లతో కలిసి గడిపే ఈ సమయం నిజంగా ప్రత్యేకమైనది. అలాంటి సందర్భంలో వాళ్లకు చిన్నదైనా గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే... సరైన ఐడియా దొరకడం కాస్త కష్టమే. అందుకే ఈ క్రిస్మస్ గిఫ్టింగ్‌ను ఈజీగా, స్పెషల్‌గా మార్చే కొన్ని మంచి ఆప్షన్స్ మీ కోసం...
Details
ఇష్టమైన రెస్టారెంట్ ఫుడ్ గిఫ్ట్
పండుగల వేళ ఇంట్లో వంట చేయడం కొంచెం భారంగా అనిపిస్తే, మీ వాళ్లకు నచ్చే రెస్టారెంట్ ఫుడ్ వోచర్ ఇవ్వడం మంచి ఐడియా. వాళ్లు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకుని, మీతో కలిసి బయట సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కేవలం గిఫ్ట్‌గా కాకుండా, ఒక మధురమైన అనుభవంగా మారుతుంది
Details
యోగా లేదా జిమ్ మెంబర్‌షిప్
మీ ఫ్రెండ్స్ లేదా కుటుంబంలో హెల్త్‌పై ఆసక్తి ఉన్నవాళ్లు ఉంటే, యోగా లేదా జిమ్ మెంబర్‌షిప్ బెస్ట్ గిఫ్ట్ అవుతుంది. కొత్త సంవత్సరం దగ్గరపడుతున్న వేళ చాలా మంది ఫిట్‌గా మారాలని అనుకుంటారు. అలాంటి లక్ష్యానికి మీరు ఇచ్చే ఈ గిఫ్ట్ వాళ్లకు నిజంగా ఉపయోగపడుతుంది. అవుట్‌డోర్ ఎక్స్‌పీరియెన్స్ ఇంట్లోనే కాకుండా బయటికి వెళ్లి కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటే, థ్రిల్ గేమ్స్, అడ్వెంచర్ జోన్స్ లేదా ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్ల టికెట్స్ గిఫ్ట్ చేయొచ్చు. ముందుగానే ప్లాన్ చేస్తే, టెన్షన్ లేకుండా అందరూ కలిసి మంచి టైమ్ గడపవచ్చు.
Details
లైవ్ మ్యూజిక్ షో టికెట్స్
మ్యూజిక్ లవర్స్ కోసం లైవ్ మ్యూజిక్ షో టికెట్స్ అద్భుతమైన గిఫ్ట్. క్రిస్మస్ సీజన్‌లో చాలా చోట్ల మ్యూజిక్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. గ్రూప్‌గా వెళ్లి పండుగను మరింత స్పెషల్‌గా మార్చుకోవచ్చు. రిలాక్సేషన్ వోచర్స్ పని ఒత్తిడితో అలసిపోయే వాళ్లకు స్పా, బాడీ మసాజ్ లేదా పార్లర్ వోచర్స్ గిఫ్ట్ చేయడం మంచి ఆలోచన. ఇదివాళ్లకు పూర్తిగా రిలాక్స్ అయ్యే అవకాశం ఇస్తుంది. పండుగ ముందు తర్వాత ఎప్పుడైనా ఉపయోగించుకునేలా ఉంటుంది. హోమ్‌మేడ్ ఫుడ్ ట్రీట్ అన్నింటికంటే స్పెషల్ గిఫ్ట్ ఏదైనా ఉందంటే, అది మన చేతులతో వండి పెట్టిన ఆహారమే. అందరికీ నచ్చేలా చిన్న క్రిస్మస్ ట్రీట్ లేదా హోమ్‌మేడ్ డిష్ తయారు చేసి ఇస్తే, ఆ జ్ఞాపకం వాళ్లకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.