Ragi Cutlets : రాగిపిండితో క్రిస్పీ కట్‌లెట్స్.. పిల్లలకు ఇలా చేసి సర్‌ప్రైజ్ ఇవ్వండి!
ఈ వార్తాకథనం ఏంటి
రాగిపిండితో సాధారణంగా ఇడ్లీ, దోసె, పొంగనాలు, జావ వంటి వంటకాలు చేస్తుంటారు.అయితే ఇదే రాగిపిండితో రుచికరమైన స్నాక్స్ కూడా తయారు చేయొచ్చని చాలా మందికి తెలియదు. కాస్త భిన్నంగా ప్రయత్నించాలని అనుకుంటే రాగి కట్‌లెట్స్ ఒక మంచి ఆప్షన్.ఇవి చాలా సింపుల్‌గా, తక్కువ సమయంలో సిద్ధం చేసుకోవచ్చు. డీప్ ఫ్రై అవసరం లేకుండా, ఎక్కువ మసాలాలు లేదా కారం లేకుండానే నోటికి కొత్త రుచిని అందిస్తాయి. కొత్తగా వంట ప్రారంభించే వారికీ ఈ రెసిపీ సులభమే. సూచించిన విధంగా చేస్తే ఇంటిల్లిపాదీకి నచ్చేలా ఉంటాయి. పిల్లలు, పెద్దలు ఇద్దరికీ ఫేవరెట్ స్నాక్‌గా మారే అవకాశం ఉంది. మరి క్రిస్పీ, టేస్టీ రాగి కట్‌లెట్స్ తయారీకి అవసరమైన పదార్థాలు, తయారీ విధానం ఏమిటో చూద్దాం.
Details
కావాల్సిన పదార్థాలు
రాగిపిండి - 2 కప్పులు కీరదోసకాయలు - 2 బీట్‌రూట్ - 2 క్యారెట్ - 2 ఉప్పు - రుచికి సరిపడా నెయ్యి - కొద్దిగా
Details
తయారీ విధానం
మొదటగా రెండు క్యారెట్లు, రెండు బీట్‌రూట్లు, రెండు కీరదోసకాయలను శుభ్రంగా కడిగి వాటి పొట్టు తీసేయాలి. అనంతరం గ్రేటర్‌తో సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లో రెండు కప్పుల రాగిపిండి తీసుకుని, ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్, బీట్‌రూట్, కీరదోసకాయ తురుమును కలపాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసి మెత్తని ముద్దలా కలిపి పక్కన ఉంచాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్‌లో కొద్దిగా నెయ్యి వేయాలి.
Details
తయారీ విధానం1/2
నెయ్యి కరిగిన తర్వాత సిద్ధం చేసిన పిండిని కొద్దికొద్దిగా తీసుకుని చేతులతో రౌండ్ షేప్‌లో చిన్న కట్‌లెట్స్‌లా తయారు చేసి పాన్‌లో వేయాలి. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి కట్‌లెట్స్‌ను రెండు వైపులా తిప్పుతూ బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. అవి సరిగ్గా కాలిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే వేడి వేడి రాగి కట్‌లెట్స్ రెడీ! టమోటా కెచప్‌తో తింటే రుచికరంగా ఉంటాయి.