Curd Poha: గ్యాస్‌తో పనిలేదు.. క్షణాల్లో బ్రేక్‌ఫాస్ట్ రెడీ..!
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా ఉదయం మొదలుకుని రాత్రి ఆహారం వరకు ఎక్కువ వంటకాలు పొయ్యి వెలిగించకుండా తయారు కావు. కానీ ప్రస్తుతం పరిస్థితులు కొంచెం భిన్నంగా మారాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల వల్ల చాలా చోట్ల గ్యాస్ సమస్యలు మొదలయ్యాయి. అందుకే గ్యాస్ వినియోగం లేకుండా, పొయ్యి వెలిగించకుండానే తయారుచేసుకునే బ్రేక్‌ఫాస్ట్ గురించి తెలుసుకుందాం.
వివరాలు
తక్కువ టైం..ఎక్కువ రుచి
గ్యాస్ కొరత కారణంగా కొందరు ఉదయపు అల్పాహారాన్ని వదిలేస్తున్నారు.
అయితే బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయడం ఆరోగ్యానికి మంచిది కాదు.
ఖాళీ కడుపుతో ఉండటానికి బదులుగా తేలికగా, ఆరోగ్యకరంగా ఉండే ఒక వంటకాన్ని చాలా తక్కువ సమయంలో తయారుచేసుకోవచ్చు.
కేవలం ఐదు నిమిషాల్లో సిద్ధమయ్యే రుచికరమైన పెరుగు అటుకులు (Curd Poha) మంచి ఎంపిక అని చెప్పొచ్చు.
వివరాలు
పెరుగు అటుకులు తయారుచేయడానికి అవసరమైన పదార్థాలు
అటుకులు - ఒక కప్పు (పలుచగా ఉన్నవి అయితే మంచిది)
పెరుగు - ఒక కప్పు
క్యారెట్ తురుము - రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - ఒకటి
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - తగినంత
కరకరలాడే టచ్ కోసం - పల్లీలు లేదా మిక్చర్
రుచిని మరింత పెంచేందుకు - అర టీ స్పూన్ నిమ్మరసం (ఇష్టమైతే వేసుకోవచ్చు)
వివరాలు
తయారు చేసే విధానం
మొదట గిన్నెలో అటుకులను తీసుకుని వాటిని నీటితో కడగాలి.
తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి అటుకులను మూడు నిమిషాలు పక్కన పెట్టాలి.
తర్వాత ఒక బౌల్‌లో నానిన అటుకులను వేసి అందులో ఒక కప్పు పెరుగు, తగినంత ఉప్పు కలపాలి.
ఆ తరువాత ముందుగా తురిమిన క్యారెట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
వడ్డించే ముందు పైపైగా కొద్దిగా పల్లీలు లేదా మిక్చర్ చల్లితే తినేటప్పుడు కరకరలాడే రుచిని ఇస్తుంది.
కొంచెం పులుపు ఇష్టపడేవారు చివరగా కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.
ఈ విధంగా పొయ్యి అవసరం లేకుండా, తక్కువ సమయంలో తయారయ్యే ఈ పెరుగు అటుకులు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచివి.