Page Loader
Dasara Navaratri 2023: ఆరవ రోజు విద్యాబుద్ధులను ప్రసాదించే సరస్వతీ దేవిగా అమ్మవారి దర్శనం 
సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం

Dasara Navaratri 2023: ఆరవ రోజు విద్యాబుద్ధులను ప్రసాదించే సరస్వతీ దేవిగా అమ్మవారి దర్శనం 

వ్రాసిన వారు Sriram Pranateja
Oct 20, 2023
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాత అమ్మవారు ఒక్కో రోజున ఒక్కో రూపంలో దర్శనం ఇస్తారు. ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన నవరాత్రులు మొదలయ్యాయి. అక్టోబర్ 24వ తేదీన నవరాత్రులు ముగుస్తాయి. ఈ రోజున నవరాత్రుల్లో ఆరవ రోజు. ఈ రోజున అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి రూపంలో దర్శనం ఇస్తారు. నవరాత్రుల్లో భాగంగా దుర్గామాత అమ్మవారిని మండపాల్లో ప్రతిష్టించి పూజలు చేసేవారు ఆరవ రోజున అమ్మవారిని సరస్వతి దేవి అలంకరణలో పూజిస్తారు. సరస్వతి దేవి రూపంలో తెలుపు రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు. ఇంకా తెల్లని పూలతో, చామంతులతో అమ్మవారిని పూజిస్తే మంచి కలుగుతుందని భక్తుల నమ్మకం.

Details

విద్యాబుద్ధులను ప్రసాదించే సరస్వతీ దేవి 

సరస్వతీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు కాబట్టి ఈ రోజున సరస్వతి శ్లోకాన్ని పఠించాలి. సరస్వతి నమ:స్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అనే శ్లోకాన్ని ఈరోజు పఠించాల్సి ఉంటుంది. ఆరవ రోజున సరస్వతీ దేవి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని పూజించడం వల్ల విద్యాబుద్ధులు కలుగుతాయని, జ్ఞాన సంపద పెరుగుతుందని భక్తుల విశ్వాసం. తమ పిల్లలకు విద్యాబుద్ధులు ప్రసాదించాలని ఈ రోజున అమ్మవారిని భక్తులు పూజిస్తారు. చాలామంది ఈ రోజున తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. విద్యకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారు ఆరవ రోజున సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారిని పూజిస్తే తమ రంగంలో ఉన్నత స్థాయి దొరుకుతుందని విశ్వాసం.