Dasara Navaratri 2023: అమ్మవారి చేతుల్లోని పది ఆయుధాల విశిష్టత, విశేషాలు
దసరా నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15వ తేదీన మొదలయ్యాయి. అక్టోబర్ 24వ తేదీ వరకు కొనసాగుతాయి. నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాత అమ్మవారిని పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. దుర్గామాత అమ్మవారి చేతుల్లో 10ఆయుధాలు మనకు కనిపిస్తాయి. ప్రస్తుతం ఆ ఆయుధాల విశిష్టత గురించి తెలుసుకుందాం. రాక్షస రాజు మహిషాసురుడు భూమిని, స్వర్గాన్ని ఆక్రమించుకున్నప్పుడు, ఆ రాక్షసుడిని సంహరించడానికి అమ్మవారికి దేవతలందరూ ఆయుధాలను అందిస్తారు. త్రిశూలం, కత్తి: త్రిశూలం ఆయుధాన్ని మహాశివుడు అమ్మవారికి అందిస్తారు. త్రిశూలానికి మూడు పదునైన అంచులు ఉంటాయి. కత్తి ఆయుధాన్ని గణేశుడు అమ్మవారికి అందిస్తారు. జ్ఞానానికి, తెలివికి కత్తి సింబల్ గా నిలుస్తుంది.
ఈటె, వజ్రాయుధం
శుభ సూచకానికి చిహ్నంగా ఈటె ఆయుధాన్ని అగ్ని భగవానుడు అమ్మవారికి అందించారు. వజ్రాయుధాన్ని ఇంద్ర దేవుడు అమ్మవారికి ఇచ్చారు. ఆత్మ బలానికి, మనో శక్తికి గుర్తుగా ఈ ఆయుధం నిలుస్తుంది. సుదర్శన చక్రము, గొడ్డలి: సుదర్శన చక్రాన్ని విష్ణు దేవుడు అందించారు. శత్రువులను శాశ్వతంగా సంహరించడానికి ఈ ఆయుధాన్ని అందించారు. విశ్వకర్మ భగవంతుడి నుండి గొడ్డలిని అమ్మవారు అందుకున్నారు. ఎలాంటి పరిస్థితులకు భయపడకుండా శత్రువులను ఎదుర్కోవాలనే ఉద్దేశ్యంతో ఈ ఆయుధాన్ని అందించారు. బాణము, ధనుస్సు, కలువ: ధనస్సు, బాణాన్ని వాయుదేవుడు అందించారు. కలవ పువ్వును బ్రహ్మదేవుడు తెలివికి చిహ్నంగా అమ్మవారికి అందించారు. నత్తగుల్ల, పాము: వరుణ దేవుడు అమ్మవారికి నత్తగుల్లను ఆయుధంగా ఇచ్చారు. శివుడిలోని శక్తి పాములో ఉందని చెబుతారు.