
తలనొప్పి ఇబ్బంది పెడుతోందా? ఈ యోగాసనాలు ప్రయత్నించండి
ఈ వార్తాకథనం ఏంటి
తలనొప్పిని ఎవ్వరూ భరించలేరు. అకస్మాత్తుగా నొప్పి కలిగితే అప్పుడు తట్టుకోవడం మరింత కష్టమవుతుంది. తలనొప్పిని తగ్గించడానికి మందులు వాడుతుంటారు.
కానీ రెగ్యులర్ గా మందులు వాడడం అస్సలు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే యోగా వైపు మళ్ళండి. యోగాసనాలు తలనొప్పిని మాయం చేస్తాయి.
బాలాసనం:
మోకాళ్ళ మీద కూర్చుని, పిరుదులను కాలిమడమలకు ఆనించి, ఆ తర్వాత నడుమును పూర్తిగా వంచాలి, శరీర రొమ్ముభాగం తొడలను తాకేవరకూ చేసి, చేతులను తలకు సమాంతరంగా ముందుకు చాచాలి. 5నిమిషాలు చేస్తే సరిపోతుంది.
పచ్చిమోత్థాసనం:
కాళ్ళను ముందు చాపి కూర్చుని, చేతులను చాపి కాలి బొటనవేలును పట్టుకోవాలి. లేదంటే మోకాళ్ళను పట్టుకుని, అలానే నడుమును వంచి తలను మోకాళ్ళను ఆనించాలి.
తలనొప్పి
తలనొప్పిని తగ్గించే ఇతర యోగాసనాలు
ఉత్థాసనం:
ఈజీగా నిల్చుని చేతులను పైకి చాచి, నడుమును వంచుతూ, చేతులను నెమ్మదిగా నేలకు ఆనించాలి. ఈ టైమ్ లో మోకాళ్ళను వంచకూడదు. ఇలా కొన్ని సెకన్ల పాటు ఉండాలి. నడుము నొప్పులు, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నవారు ఇలాంటి యోగాసనాలు చేయకూడదని గుర్తుంచుకోవాలి.
విపరీత కారణి:
యోగా మ్యాట్ ని గోడకు దగ్గరగా జరుపుకుని, దాని మీద వెల్లడికిలా పడుకుని పిరుదుల మీద చేతులను పెట్టి కాళ్ళను గాల్లో పైకి లేపాలి. కావాలంటే కాళ్ళను గోడకు ఆనించవచ్చు. ఇలా కొన్ని నిమిషాలు చేయాలి.
సేతు బంధాసనం:
వెల్లకిలా పడుకుని మోకాళ్ళను మడిచి దగ్గరకు తీసుకుని, నడుము భాగాన్ని పైకి లేపాలి. ఈ టైమ్ లో చేతులతో కాలి మడమలను గట్టిగా పట్టుకోవాలి.