LOADING...
Dehydration: ఎండాకాలంలో డీహైడ్రేషన్ ముప్పు : నీళ్లు తాగడమే కాదు, ఈ జాగ్రత్తలు పాటించాలి!
ఎండాకాలంలో డీహైడ్రేషన్ ముప్పు : నీళ్లు తాగడమే కాదు, ఈ జాగ్రత్తలు పాటించాలి!

Dehydration: ఎండాకాలంలో డీహైడ్రేషన్ ముప్పు : నీళ్లు తాగడమే కాదు, ఈ జాగ్రత్తలు పాటించాలి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2025
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం తప్పదు. అయితే ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే తక్కువగా చేరడం లేదు. గొంతు ఎండిపోవడం, కళ్లు తిరగడం, కళ్లు ఎర్రబడటం, మూత్రం పసుపు రంగులో రావడం వంటి లక్షణాలు కనిపిస్తే, మీరు తగినన్ని నీళ్లు తాగడం లేదని అర్థం. ఆరోగ్యపరంగా సమస్యలు లేకున్నా, వేసవి తీవ్రత వల్ల ఈ లక్షణాలు కనిపిస్తే, ఇది ఓ ప్రమాద సూచికగా భావించాలి. ప్రస్తుతం వేడిగాలి, ఉక్కపోతతో పాటు చెమట విపరీతంగా రావడంతో శరీరంలోని నీటి మోతాదు తగ్గిపోతోంది. దీనివల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ పరిమాణం తగ్గిపోతుంది, ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఈ పరిస్థితినే డీహైడ్రేషన్‌గా పేర్కొంటారు.

Details

డీహైడ్రేషన్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటే?

డీహైడ్రేషన్ తీవ్ర స్థాయికి చేరుకుంటే, అది ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. కొంతమందికి ఏసీ గదిలో ఉంటే చెమట పట్టదు కదా, నీటి అవసరం తగ్గుతుంది అనే భావన ఉండొచ్చు. కానీ ఎప్పుడూ ఏసీ వాతావరణంలోనే ఉంటే దాహం వేయకపోవచ్చు. ఏప్రిల్‌ మొదటి వారం నుంచే చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీస్తున్నాయి. వేడి వాతావరణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యానికి ముప్పు తప్పదు. అందుకే డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవాలంటే, తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Details

 డీహైడ్రేషన్ ఎప్పుడు వస్తుంది? 

ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల వడదెబ్బతో పాటు డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. డయేరియా లేదా ఇతర అనారోగ్య కారణాల వల్ల శరీరంలోని నీరు కోల్పోతే డీహైడ్రేషన్ వస్తుంది. అధిక మద్యపానం, కెఫిన్ అధికంగా ఉండే పానీయాలు సేవించడం వల్ల నీటి శాతం తగ్గుతుంది. చెమట అధికంగా పట్టినప్పుడు లేదా కఠినమైన వ్యాయామం చేసిన తర్వాత డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మూత్రవిసర్జనకు ఉపయోగించే కొన్ని రకాల మందులు కూడా ఈ సమస్యకు దారితీస్తాయి.

Details

డీహైడ్రేషన్ లక్షణాలు ఏమిటి?

అధిక దాహం ముదురు పసుపురంగులో, దుర్వాసనతో కూడిన మూత్రం రావడం సాధారణం కంటే తక్కువగా మూత్రవిసర్జన జరగడం మైకం లేదా తేలికపాటి తల తిరుగుడు - అలసట ఎక్కువగా ఉండటం పెదవులు, నాలుక పొడిబారిపోవడం - కళ్ళు పీక్కుపోవడం ఈ లక్షణాలు కనిపించినప్పుడు, తగినన్ని నీళ్లు తాగడంతో పాటు శరీరానికి అవసరమైన మినరల్స్‌ అందించాలి. అయితే పరిస్థితి తీవ్రమైతే, తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి.