
Sri Ramanavami Recipes: శ్రీరామనవమికి రుచికరమైన చిట్టి గారెలు.. ఇలా తయారు చేయండి!
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీరామనవమి వచ్చినప్పుడల్లా ప్రతి వీధిలో శ్రీరామ కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా నైవేద్యంగా పానకం, వడపప్పు, చలివిడితో పాటు మరికొన్ని ప్రత్యేక వంటకాలను నివేదిస్తారు.
మీరు శ్రీరామనవమికి ఏ ప్రసాదాలను తయారు చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ చిట్టి గారెలు ఒకసారి ప్రయత్నించి చూడండి.
ఇవి ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా, తక్కువ సమయంతో సులభంగా తయారు చేసుకోవచ్చు.
Details
చిట్టి గారెలు రెసిపీ
కావలసిన పదార్థాలు
మినప్పప్పు - ఒక కప్పు
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
Details
తయారీ విధానం
1.మినప్పప్పుని శుభ్రంగా కడిగి 6 గంటలు నానబెట్టుకోవాలి.
2.ఆ తర్వాత నీటిని వంపేసి, మిక్సీలో ఉప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
3. పిండి గట్టిగా ఉంటే గారెలు సులువుగా తయారవుతాయి.
4.పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర తరుగు, తరిగిన ఉల్లిపాయలు, చిటికెడు వంట సోడా వేసి బాగా కలపాలి.
5.స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై కోసం తగినంత నూనె వేసి వేడిచేయాలి.
6. పిండిని చిన్న చిన్న గారెల్లా చేసి, మధ్యలో రంధ్రం పెట్టి నూనెలో వేయాలి.
7.రెండు వైపులా బాగా ఎర్రబడే వరకు వేయించాలి.
8.ఇలా తయారైన చిట్టి గారెలు నైవేద్యంగా సమర్పించి, తింటే ఎంతో రుచిగా ఉంటుంది.