
డెస్టినేషన్ వెడ్డింగ్: మీ బడ్జెట్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి అనువైన ప్రదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
కరోనా తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే డెస్టినేషన్ వెడ్డింగ్స్ బాగా తగ్గిపోయాయి.
అయితే ప్రస్తుతం కరోనా భయం అంతలా లేదు కాబట్టి డెస్టినేషన్ వెడ్డింగ్ పై ఆసక్తి మెల్లెమెల్లగా పెరుగుతోంది.
ప్రస్తుతం తక్కువ బడ్జెట్ లో డెస్టినేషన్ పెళ్ళికి అనువైన ప్రదేశాలు భారతదేశంలో ఎక్కడ ఉన్నాయో, అక్కడ ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం.
చోము ప్యాలెస్ - జైపూర్:
డెస్టినేషన్ పెళ్ళిళ్ళకు రాజస్థాన్ రాష్ట్రం చాలా ఫేమస్. జైపూర్ లోని చోము ప్యాలస్ లో డెస్టినేషన్ పెళ్ళిళ్ళు చాలా జరుగుతాయి.
జైపూర్ నుండి 35కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్యాలెస్ లో పెళ్ళి కావాలనుకుంటే, 200మంది అతిధులకు 35లక్షల ఖర్చు అవుతుంది.
Details
గోవాలో తక్కువ ఖర్చుతో డెస్టినేషన్ వెడ్డింగ్
హ్యావెలాక్ దీవి:
అండమాన్ నికోబార్ దీవుల్లోని ఈ ప్రాంతంలో పెళ్ళి చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. ఈ ప్రాంతంలో పెళ్ళి చేసుకోవాలనుకుంటే 5-10లక్షల ఖర్చు అవుతుందని తెలుస్తోంది.
గోవా:
గోవాలో పెళ్ళి అంటే ఆ మజానే వేరు. సముద్రపు అందాల్ని ఆస్వాదిస్తూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలంటే 10-15లక్ష్ల ఖర్చు అవుతుందని సమాచారం.
కోవలం:
కేరళలోని కోవలం ప్రాంతంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఖర్చు కూడా తక్కువ. 200మంది అతిధులకు 8నుండి 10లక్షల ఖర్చు కాగలదు.
ఉదయ్ పూర్:
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఎక్కువగా జరుగుతాయి. ఇక్కడ పెళ్ళి చేసుకోవడానికి 100మంది అతిధులకు 12-15లక్షల ఖర్చు అవుతుందని సమాచారం.