
క్రీమ్స్, లోషన్స్, ఆయింట్మెంట్స్, జెల్స్ మధ్య తేడాలు మీకు తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
చర్మసాధనాల్లో చాలా వెరైటీలు ఉంటాయి. క్రీమ్స్, లోషన్స్, ఆయింట్మెంట్స్, జెల్స్, బామ్స్ అని రకరకాలుగా కనిపిస్తాయి. వీటిని ఒక్కో ఉపయోగానికి వాడతారు.
అయితే చాలామందికి వీటి మధ్య తేడాలు అస్సలు తెలియదు. ప్రస్తుతం వీటి మధ్య తేడాలు ఏంటో తెలుసుకుందాం.
చిక్కదనంలో తేడాలు:
క్రీమ్స్ అనేవి మరీ గ్రీజు మాదిరిగా కాకుండా నార్మల్ గా ఉంటాయి. ఇవి లోషన్స్ కంటే చిక్కగా ఉంటాయి.
లోషన్స్ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి పలుచగా ఉంటాయి.
ఆయింట్మెంట్స్ లో నీటి శాతం తక్కువ కాబట్టి క్రీమ్స్, లోషన్స్ కన్నా ఎక్కువ చిక్కగా ఉంటాయి.
బామ్స్ కూడా ఆయింట్మెంట్స్ లానే ఉంటాయి. ఇక జెల్స్ అనేవి పాక్షిక ఘనపదార్థంగా ఉంటాయి.
Details
ఆయిల్ శాతం
క్రీమ్స్ లో ఆయిల్ తక్కువగా ఉంటుంది. ఆయింట్మెంట్లలో ఎక్కువగా ఉంటుంది.
ఇక జెల్స్ లో ఆయిల్ ఉండదు. లోషన్స్ లో క్రీమ్స్ లో కంటే తక్కువ ఆయిల్ ఉంటుంది.
బామ్స్ లో కూడా ఆయిల్ ఉంటుంది కానీ ఆయింట్మెంట్లలో కంటే తక్కువ ఆయిల్ ఉంటుంది.
ఉపయోగాల మధ్య తేడాలు:
క్రీమ్స్ అనేవి చర్మాన్ని తేమగా ఉంచడానికి ఉపయోగపడతాయి. బామ్స్ వల్ల చర్మం రిపేర్ అవుతుంది.
ఆయింట్మెంట్స్ లో ఉండే వైద్య సంబంధ లక్షణాల వల్ల చర్మానికి తగిలిన గాయాలు మానిపోతాయి.
మొటిమలు, మచ్చలు మొదలగు వాటిని తొలగించడానికి చర్మం లోపలికి లోషన్స్ వెళతాయి.
జెల్స్ వల్ల మీ చర్మం యవ్వనంగా, మెరిసే విధంగా కనిపిస్తుంది.