
జుట్టుకు మాత్రమే కాకుండా చర్మానికి సంరక్షణ అందించే కొబ్బరి నూనె ప్రయోజనాలు
ఈ వార్తాకథనం ఏంటి
జుట్టుకు కొబ్బరి నూనె పెట్టుకోవడం మర్చిపోతే పెద్దలు గుర్తుచేసి మరీ కొబ్బరినూనె కచ్చితంగా పెట్టుకోవాలని చెబుతారు.
పెద్దలు చాదస్తం కొద్ది చెబుతున్నారని మీరు కొబ్బరినూనె మర్దన చేసుకోవడం ఆపేస్తే మీరే నష్టపోతారు.
కొబ్బరి నూనె వల్ల జుట్టుకు, చర్మానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. జుట్టుకు మంచి మెరుపును అందించడంలో కొబ్బరినూనె ఎంతగానో సాయపడుతుంది.
ప్రస్తుతం కొబ్బరి నూనె వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
చర్మాన్ని తేమగా ఉంచే కొబ్బరి నూనె:
మీరు పొడి చర్మంతో బాధపడుతున్నట్లయితే స్నానం చేసే ముందు మీ చర్మానికి కొబ్బరి నూనెతో మర్దన చేయండి.
ఇంకా రాత్రిపూట పడుకునే ముందు శరీరానికి కొబ్బరి నూనె రాసుకుని నిద్రపోండి. దీనివల్ల చర్మం తేమగా మారుతుంది.
Details
తాజా శ్వాసను అందించే కొబ్బరి నూనె
ముడతలను తగ్గిస్తుంది:
కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. స్నానం చేసే ముందు కొబ్బరినూనెను చర్మానికి మర్దన చేసుకోవడం వల్ల చర్మంపై ముడతలు తగ్గిపోతాయి. మొటిమలు కూడా తగ్గిపోయి చర్మం మృదువుగా మారుతుంది.
నోటి దుర్వాసన తగ్గిస్తుంది:
ఆయిల్ పుల్లింగ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. మార్కెట్లో దొరికే వంట కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల నోటిలోని హానికారక బ్యాక్టీరియా చనిపోతుంది.
కాలి పగుళ్లను తగ్గిస్తుంది:
శరీరంలోని వేడి, నీటిలో ఎక్కువగా తడవడం మొదలగు కారణాలవల్ల కాలి మడమలు పగలడం, వేళ్ళ మధ్యలో చిన్నచిన్న పుండ్లు ఏర్పడడం జరుగుతుంది. దీన్ని అథ్లెట్ ఫుట్ అంటారు. అథ్లెట్ ఫుట్ తగ్గించడానికి కొబ్బరి నూనెతో మర్దన చేస్తే సరిపోతుంది.