కేరళలో తప్పనిసరిగా సందర్శించాల్సిన ఈ ప్రదేశాల గురించి తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రకృతి, సంస్కృతి, సంప్రదాయలకు కేరళ ప్రసిద్ధి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పురాతన దేవాలయాలు, చర్చిలు, అద్భుతమైన శిల్ప కళా సంపద పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. బీచ్‌లు, జలపాతాలు, ఆలయాలతో అబ్బురపరిచే త్రిస్సూర్‌లో తప్పనిసరిగా సందర్శించాల్సిన ఐదు పర్యాటక ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పున్నతుర్ కోట:
త్రిస్సూర్‌లో సందర్శించాల్సిన ప్రసిద్ధ ప్రదేశం పున్నతుర్ కోట. ఇదొక ఏనుగుల అభయారణ్యం. ఇందులో 59 ఏనుగులు ఉన్నాయి.
పురాణాల ప్రకారం, పున్నతుర్ కోట అనేది ఒకప్పుడు రాజభవనం. ఈ అభయారణ్యంలో 'మహోత్స్' అనే ఏనుగుల సవారీ శిక్షణా కేంద్రం, భగవతీ దేవి ఆలయ కూడా ఉంది.
పర్యాటక ప్రదేశం
త్రిస్సూర్ శివార్లలో 'నయాగరా జలపాతం ఆఫ్ ఇండియా'
అతిరప్పిల్లి జలపాతం
త్రిస్సూర్ శివార్లలో ఉన్న అతిరప్పిల్లి జలపాతం రాష్ట్రంలోనే అతిపెద్ద జలపాతం. 24 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పు గల జలపాతాన్ని "నయాగరా జలపాతం ఆఫ్ ఇండియా" అని కూడా పిలుస్తారు.
చలకుడి నదిపై ఉన్న ఈ జలపాతం విహారానికి చక్క ప్రదేశం.
చావక్కాడ్ బీచ్
త్రిస్సూర్‌లోని చవక్కాడ్ బీచ్‌ను సందర్శించేందుకు ప్రపంచ నలుమూల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
ఈ బీచ్‌లోని బంగారు ఇసుక, నీలి జలాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ నిర్మలమైన బీచ్‌లో రాళ్లకు వ్యతిరేకంగా అలల శబ్దం సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది.
సూర్యాస్తమయాన్ని వీక్షించడానికి ఈ బీచ్ చక్కటి స్పాట్‌గా చెబుతుంటారు.
కేరళ
పారమెక్కవు భగవతి ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర
పారమెక్కవు భగవతీ ఆలయం
త్రిస్సూర్‌లోని తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశాల్లో పారమెక్కవు భగవతి ఆలయం ఒకటి. ఇక్కడ వైష్ణవి దేవి కొలువై ఉంటుంది.
ఈ ఆలయానికి దాదాపు 1000ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఏడాది పొడవునా భక్తులు భారీగా తరలివస్తుంటారు.
బాసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ డోలర్స్ చర్చి
బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ డోలర్స్ చర్చి రాష్ట్రంలోనే అతి పెద్దది. ఇది 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. త్రిస్సూర్‌లో స్వచ్ఛమైన తెల్లని రత్నంలా మెరుస్తూ, నగరంలోని పచ్చని లోయల మధ్య ఈ చర్చి ఉంటుంది. అనేక ప్రత్యేకతలు ఉన్న ఈ చర్చిని చూసేందుకు భారీ ఎత్తున పర్యాటకులు తరలివస్తుంటారు.