
Childs-Brain: పిల్లల మేధస్సు పదునెక్కాలంటే.. ప్రతి ఉదయం ఈ ఐదు పనులు తప్పనిసరిగా చేయించండి!
ఈ వార్తాకథనం ఏంటి
పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రుల ఆశ.
అయితే దీన్ని సాధించేందుకు మనం రోజు ఏం చేస్తున్నామో నిజంగా ఆలోచించామా?
చిన్ననాటి నుంచే కొన్ని మంచి అలవాట్లను పిల్లల్లో పెంపొందిస్తే, వారి భవిష్యత్ మెరుగ్గా ఉంటుంది.
ముఖ్యంగా ఉదయపు సమయంలో కొంత సమయాన్ని వారి మానసిక ఎదుగుదలకు తోడ్పడే విధంగా ఉపయోగిస్తే ఎంతో ఉపయోగకరం.
మరి అలాంటి అవసరమైన అలవాట్లు ఏవో తెలుసుకుందాం.
వివరాలు
1. పిల్లలతో ప్రేమను పంచుకోండి
ఉదయం సమయంలో మన మూడ్ మొత్తం రోజునీ ప్రభావితం చేస్తుంది. కనుక పిల్లలు నిద్రలేచిన వెంటనే వారిని కేకలతో లేపకుండా, శాంతంగా నిద్రలేచేలా చేయండి. కొద్దిసేపు వారి పక్కన కూర్చొని, హత్తుకుని, ముద్దుపెట్టి, ప్రేమగా మాట్లాడండి. ''నువ్వు నాకు ఎంత ప్రత్యేకమవో'' అని చెప్పండి.
ఇది పిల్లల్లో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలకు దోహదపడుతుంది, ఇది మెదడు కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. ప్రేమతో ప్రారంభమైన రోజు, వారిలో సానుకూలతను పెంచుతుంది.
వివరాలు
2. ఉదయం దినచర్యలో చదవడం చేర్చండి
పిల్లల రోజువారీ పనుల్లో కొంత సమయాన్ని చదవడానికి కేటాయించండి. ఇది స్కూల్ బుక్స్ మాత్రమే కాకుండా, వారికి ఆసక్తికరంగా అనిపించే కథలు, సమాచార పుస్తకాలు కావచ్చు. మంచి మౌలిక విలువలు, గుణాలు నేర్పే కథలు వారికి కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం ఇస్తాయి. ఇలా చేయడం వల్ల చదువుపై ఆసక్తి పెరగడమే కాదు, మెదడు కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది.
వివరాలు
3. మైండ్‌ఫుల్ మెడిటేషన్‌తో రోజును ప్రారంభించండి
పిల్లలు దృష్టిని, ఏకాగ్రతను పెంచుకోవాలంటే ధ్యానం (మెడిటేషన్) ఎంతో సహాయపడుతుంది. వారితో కలిసి రోజూ ఉదయం కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామం చేయించండి లేదా గైడెడ్ మెడిటేషన్ వినిపించండి. ఈ అలవాటుతో మెదడు ప్రశాంతంగా మారుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. దీని ఫలితంగా వారి చదువు, ఆలోచనశక్తి కూడా మెరుగవుతుంది.
వివరాలు
4.పిల్లలను అఫర్మేషన్స్ చెప్పమని అడగండి
పిల్లలు తమను తామే బలంగా భావించడానికి, మంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి 'అఫర్మేషన్స్' చాలా ఉపయోగపడతాయి. ఉదాహరణకు - ''నేను తెలివైన వాడిని'', ''నేను ధైర్యవంతుడిని'', ''నేను ఏదైనా సాధించగలను'' వంటి వాక్యాలను ప్రతిరోజూ వారు చెప్పేలా చేయండి. ఇది వారి వ్యక్తిత్వాన్ని బలోపేతం చేస్తుంది. మీరు కోరుకునే లక్షణాలు ఏమిటో ఆ ఆధారంగా అఫర్మేషన్స్ తయారు చేయండి, వారితో రోజూ పదేపదే పునరావృతం చేయించండి.
వివరాలు
5.మానసిక, శారీరక వ్యాయామాలను చేర్చండి
పిల్లల శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక బలానికీ ప్రాముఖ్యత ఉంది. ఉదయపు సమయంలో వారు ప్రకృతిలో కొంత సమయం గడపడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం ఎంతో మేలు చేస్తుంది. అదనంగా, మెదడును పదునుగా ఉంచే మైండ్‌ఫుల్ ఆటలు లేదా పజిల్స్‌తో వారి ఆలోచనశక్తిని పెంచండి. ఉదాహరణకు - నిన్న జరిగిన 5 ముఖ్యమైన సంఘటనలను గుర్తుచేసుకొని వ్రాయమని చెప్పండి. ఈ విధంగా మెదడు చురుకుదనాన్ని సాధిస్తుంది.
ఈ ఐదు అలవాట్లను పిల్లల రోజువారీ జీవనశైలిలో చేర్చడం ద్వారా వారు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా బలంగా తయారవుతారు. ఇవి వారి మెదడును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగడానికీ దోహదం చేస్తాయి.