Page Loader
పుష్ అప్ బార్స్ ఉపయోగించి వ్యాయామాలు ఎలా చేయాలో తెలుసుకోండి 
పుష్ అప్ బార్స్ తో చేయాల్సిన వ్యాయామాలు

పుష్ అప్ బార్స్ ఉపయోగించి వ్యాయామాలు ఎలా చేయాలో తెలుసుకోండి 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 21, 2023
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

అరచేతులను నేలమీద పెట్టి పుష్ అప్స్ చేయడం కష్టమైన పని. కొందరు పిడికిలిని నేలమీద పెట్టి పుష్ అప్స్ చేస్తారు. ఇలా చేసేటపుడు అరచేతులను, మణికట్టు భాగానికి గాయాలు అవుతుంటాయి. పుష్ అప్స్ చేయడానికి పుష్ అప్ బార్స్ బాగా పనిచేస్తాయి. ఈ బార్స్ తో రకరకాల వ్యాయామాలు చేయవచ్చు అవేంటో తెలుసుకుందాం. మౌంటేన్ క్లయింబ్స్ (Mountain climbs): అంటే పర్వతాలు ఎక్కడమన్నమాట. పుష్ అప్ చేసే పొజిషన్ లో ఉండి ఒక కాలి మోకాలిని రొమ్ము భాగానికి తాకేలా తీసుకురావాలి. ఆ తర్వాత మరో మోకాలిని కూడా. ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉండాలి.

Details

శరీర ఆకారాన్ని అందంగా మార్చే వ్యాయామాలు 

క్లోజ్ గ్రిప్ పుష్ అప్స్(close grip push ups): మీ పుష్ అప్ బార్స్ ని కొంచెం దగ్గరగా పెట్టండి. అంటే మీ శరీర లైన్ ఏదైతే ఉందో దాన్ని దాటకుండా పుష్ అప్స్ బార్స్ ని ఉంచాలి. రెండు కాళ్ళను పూర్తిగా దగ్గరగా ఉంచేసి పుష్ అప్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల భుజాలు, చేతులు కండపుష్టిగా మారతాయి. ఎల్ సిట్ (L-sit): పుష్ అప్స్ బార్స్ ని కొంచెం దగ్గరగా ఉంచాలి. ఇప్పుడు కాళ్ళను ముందుకు చాపి నేలమీద కూర్చుని పుష్ అప్స్ బార్స్ పట్టుకుని మీ శరీరాన్ని పైకి లేపాలి. మీ భారమంత పుష్ అప్స్ బార్స్ మీదే ఉండాలి. చూసేవాళ్ళకి మీ అకారం ఎల్ మాదిరిగా ఉండాలి.

Details

వైడ్ పుష్ అప్స్:

పుష్ అప్ బార్స్ ని మీ భుజాలకవతల ఉంచాలి. ఆ తర్వాత వాటిసాయంతో పుష్ అప్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల భుజాలు, మెడ, నడుము భాగం మంచి ఆకారాన్ని సంతరించుకుంటుంది.