NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Happa New Year: 2025లో ఆనందంతో గడపాలనుకుంటే, న్యూ ఇయర్ రోజున ఈ పనులు చేయండి! 
    తదుపరి వార్తా కథనం
    Happa New Year: 2025లో ఆనందంతో గడపాలనుకుంటే, న్యూ ఇయర్ రోజున ఈ పనులు చేయండి! 
    2025లో ఆనందంతో గడపాలనుకుంటే, న్యూ ఇయర్ రోజున ఈ పనులు చేయండి!

    Happa New Year: 2025లో ఆనందంతో గడపాలనుకుంటే, న్యూ ఇయర్ రోజున ఈ పనులు చేయండి! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 31, 2024
    04:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిదుడుకులు, చేదు జ్ఞాపకాలతో నిండిన 2024 సంవత్సరాన్ని అటకెక్కిస్తూ, 2025లోకి మరికొద్ది గంటల్లో అడుగుపెట్టనున్నాం.

    కొత్త ఏడాది అంటే కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో కొత్త ఆశయం మొదలుపెట్టే సమయం. ఈ ప్రత్యేక సందర్భంలో ప్రతి ఒక్కరిలో ఉత్సాహం కనిపిస్తుంది.

    పాతదంతా వెనక్కి వదిలేసి, కొత్త పనులు ప్రారంభించేందుకు సిద్ధపడతారు. పాత సమస్యలు, చెడు జ్ఞాపకాలను అధిగమించి, కొత్త సంవత్సరాన్ని సరికొత్త ఆశలతో ఆరంభించాలంటే, మొదటి రోజు చేసే పనులే ఆ సంవత్సరాన్ని ఎలా గడిపేది అనేది నిర్ణయిస్తుంది.

    మీ 2025 సంవత్సరాన్ని సుఖంగా, విజయవంతంగా ప్రారంభించాలంటే ఈ సూచనలను పాటించాలి

    Details

    పూజతో ప్రారంభించండి

    కొత్త సంవత్సరంలో ఏకంగా సానుకూల ఆలోచనలు, ఆశలతో దూసుకుపోవాలి. దేవుడిని స్మరించుకుంటూ, మీ కుటుంబం సుఖంగా ఉండాలని ప్రార్థించండి.

    నూతన సంవత్సరాన్ని, మనస్సులో మంచి ఆలోచనలతో, దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసి ప్రారంభించండి.

    లక్ష్యాలను నిర్దేశించుకోండి

    ఈ సంవత్సరం మీరు ఏది సాధించాలనుకుంటున్నారు, అన్నింటికంటే ముఖ్యమైనది మీ పెట్టుబడులు, పొదుపు. నెలకు కొన్ని నిర్ణయాలు తీసుకోండి.

    మీరు ఎలాంటి ఖర్చులను తగ్గించాలనుకుంటున్నారో, భవిష్యత్తుకు సురక్షితంగా ఉండేందుకు ఎంత పొదుపు చేయాలనుకుంటున్నారు అన్న దాన్ని ప్లాన్ చేసుకోండి.

    Details

     ఇతరులకు సాయం చేయండి 

    మీ గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించడం సరికాదు. మీకు ఉన్న దయతో, అవసరమైన వారిని ఆదుకోవడం మంచి ఆరంభమవుతుంది.

    మీ ఇంటి వారితో, సమీప సంస్కృతితో జాయ్ చేయడం, వారికి సహాయం చేయడం ద్వారా మీరు ఆనందాన్ని పొందతారు.

    ఈ విధంగా, మీరు ఇతరుల కొత్త సంవత్సరాన్ని సంతోషంగా మార్చేలా చేస్తారు, వారి ఆశీర్వాదాలు మీకు శక్తిని ఇస్తాయి.

    నిర్ణయాలు తీసుకోండి

    కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలతో మొదలు పెట్టండి. ముందుగా మీరు చెడు అలవాట్లను విడిచిపెట్టాలని నిర్ణయించుకోండి. వీటిని ఒక లిస్ట్‌గా తయారుచేసి, మీ స్వభావాన్ని మెరుగుపర్చడానికి కొత్త నైపుణ్యాలను జోడించండి.

    ఈ సంకల్పంతో, మీరు పూర్తి స్థాయిలో వ్యక్తిత్వాన్ని మెరుగుపరచవచ్చు.

    Details

     మిమ్మల్ని మీరు ప్రేమించండి 

    సంతోషంగా ఉండేందుకు మొదటి పాయింట్ స్వీయప్రేమ. ఈ కొత్త సంవత్సరంలో మీరు మీ ఆరోగ్యంపై, శరీరప్రయోజనాలపై శ్రద్ధ పెట్టండి.

    ప్రతిరోజూ వ్యాయామం, ధ్యానం, సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యమైన మార్గాలు. 30-45 నిమిషాలు ఫిట్‌నెస్ కోసం కేటాయించండి.

    శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడు మీరు ఏదైనా పనిని సులభంగా విజయవంతం చేస్తారు.

    ఈ సూచనలను పాటిస్తూ, 2025 సంవత్సరం మీరు ఆశించిన విజయాల వైపు మిమ్మల్ని నడిపిస్తాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సంవత్సరం ముగింపు 2024

    తాజా

    Stock Market: కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! స్టాక్ మార్కెట్
    Vishwambhara : కేన్స్ లో 'విశ్వంభర' బుక్ రిలీజ్.. అందులో ఏముందంటే..? మెగా ఎపిక్ సినిమాకు గ్లోబల్ అటెన్షన్ విశ్వంభర
    Munnar Travel Guide: పర్యాటకుల మనసు దోచుకునే మున్నార్ ప్రదేశాలు.. చూడాల్సిందే! పర్యాటకం
    Salman khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు సల్మాన్ ఖాన్

    సంవత్సరం ముగింపు 2024

    Year Ender 2024: 2024లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన ప్రముఖ క్రికెటర్లు వీళ్లే! క్రీడలు
    Year Ender 2024: 2024లో పెళ్లి చేసుకున్న 10 సినిమా సెలబ్రిటీ జంటలు వీళ్లే..? సినిమా
    Year ender 2024: ఈ ఏడాది కన్నుమూసిన ప్రముఖులు లైఫ్-స్టైల్
    Year Ender 2024: 2024లో యూట్యూబ్‌లో ఏ వీడియో కంటెంట్ ఎక్కువ మంది చూశారో మీకు తెలుసా? యూట్యూబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025