LOADING...
Chicken eggs: రోజూ గుడ్లు తింటున్నారా? ఇలా తింటేనే పూర్తి ప్రయోజనాలు అంటున్న నిపుణులు!
రోజూ గుడ్లు తింటున్నారా? ఇలా తింటేనే పూర్తి ప్రయోజనాలు అంటున్న నిపుణులు!

Chicken eggs: రోజూ గుడ్లు తింటున్నారా? ఇలా తింటేనే పూర్తి ప్రయోజనాలు అంటున్న నిపుణులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2026
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాధారణంగా చాలా మంది గుడ్లను ప్రోటీన్‌ సోర్స్‌గా మాత్రమే చూస్తారు. అయితే మన వంటింట్లోనే లభించే కేవలం రెండు దినుసులతో గుడ్లను ఒక 'పవర్‌హౌస్‌ ఫుడ్‌'గా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. AIIMS, హార్వర్డ్‌, స్టాన్‌ఫోర్డ్‌ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో శిక్షణ పొందిన ఆయన.. గుడ్ల నుంచి గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు ఒక ప్రత్యేకమైన విధానాన్ని వెల్లడించారు.

Details

గుడ్లు - ఒక సంపూర్ణ ఆహారం

2019లో 'న్యూట్రియెంట్స్‌' జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, గుడ్లలో ప్రోటీన్లతో పాటు కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు A, D, E, K, B సమూహం, అలాగే పలు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే గుడ్లను 'సూపర్‌ ఫుడ్‌'గా పరిగణిస్తారు. అయితే ఈ పోషకాలు పేగుల ఆరోగ్యానికి మరింత మేలు చేసేలా ఎలా ఉపయోగపడతాయో చెప్పారు. సొనతో సహా రెండు గుడ్లు రెండు గుడ్లను పచ్చసొనతో సహా ఒక బౌల్‌లో వేసుకోవాలి. చాలామంది పచ్చసొన తింటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందనే భయంతో దాన్ని తప్పిస్తుంటారు. అయితే ఇది పాతకాలపు అపోహ మాత్రమేనని డాక్టర్‌ సేథీ స్పష్టం చేశారు. ఆరోగ్యవంతులు రోజుకు రెండు పచ్చసొనలను ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చని చెప్పారు.

Details

ఆ రెండు దినుసులే అసలు రహస్యం

ఆ రెండు గుడ్లలో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి కలపాలి. ఇవే డాక్టర్‌ సేథీ చెప్పిన అసలు 'సీక్రెట్‌'. పసుపులో సహజంగా బలమైన యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అయితే మిరియాల పొడిని కలిపినప్పుడు మాత్రమే పసుపులోని ఈ గుణాలు శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి. ఈ కలయిక పేగుల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం.

Advertisement

Details

ఉప్పు - పరిమితిలోనే

గుడ్లకు రుచికి సరిపడా మాత్రమే ఉప్పు జత చేయాలని ఆయన సూచించారు. ఉప్పు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకపోయినా, ఎంత తక్కువగా వాడితే అంత ఆరోగ్యకరమని పేర్కొన్నారు. కూరగాయలతో మరింత పోషక విలువ గుడ్లలో టమోటాలు, ఉల్లిపాయలు, మష్రూమ్స్‌, ఆలివ్స్‌ వంటి మీకు నచ్చిన కూరగాయలను కలపవచ్చు. ఇలా చేయడం వల్ల ఆహారంలో ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు చేరతాయి. ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు అత్యంత ఇష్టమైన ఆహారమని డాక్టర్‌ సేథీ వివరించారు.

Advertisement

Details

తక్కువ నూనె, తక్కువ మంట 

గుడ్లను ఆమ్లెట్‌గా లేదా వేయించినా.. తక్కువ నూనెలో, తక్కువ మంట మీద సున్నితంగా వండాలని సూచించారు. నూనెలో ముంచివేయకుండా జాగ్రత్త పడితే గుడ్లలోని సహజ పోషకాలు దెబ్బతినకుండా ఉంటాయని నిపుణులు తెలిపారు.

Advertisement