
Motivation: ఒక వ్యక్తిని గొప్పవాడిని చేసే మూడు రహస్యాలు ఏమిటో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ఆచార్య చాణక్యుడు జీవితం ప్రతి రంగంలోనూ గెలుపు, ఓటమి, రాజకీయం, ఆరోగ్యం, వ్యాపారం, వైవాహిక జీవితం, సమాజం, నైతిక విలువలు, ఆర్థిక అంశాలు, బంధాలు ఎన్నో సూత్రాలను చెప్పి మనిషికి మార్గదర్శకత్వం అందించారు. అదేవిధంగా, ఒక వ్యక్తిని గొప్పవాడిగా నిలబెట్టే మూడు ముఖ్య రహస్యాలను కూడా ఆయన వివరించారు. వాటి గురించి తెలుసుకోవడం మనకు ఎంతో ఉపయోగకరం. చాణక్యుడు చెప్పిన ఉపదేశాలు నేటి తరం వారికి కూడా దిశానిర్దేశం చేస్తాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం, క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడటం, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం ఆయన బోధించిన ముఖ్యాంశాలు. ఆయన ప్రకారం, కొన్ని రహస్యాలను పాటిస్తే జీవితం మారిపోతుందని చెప్పాడు.
Details
పదవిని ఎప్పుడైనా కోల్పోవచ్చు
మొదటిగా కష్టసమయాలను అవకాశాలుగా మార్చుకోవడం చాలా ముఖ్యం. సమస్యలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గిపోకుండా, పరిష్కార మార్గాలను వెతికేవారే జీవితంలో ముందుకు సాగుతారు. రెండవది స్వీయ ఆధారబలం కలిగి ఉండడం. ఇతరులపై ఆధారపడకుండా, తమపై తాము ఆధారపడేవారే జీవితంలో గొప్ప స్థానాన్ని పొందుతారు. మూడవది సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడం.ఎందుకంటే సంపద, పదవి ఎప్పుడైనా కోల్పోవచ్చు. కానీ విద్య, జ్ఞానం మాత్రం ఎప్పటికీ కోల్పోనివి. అందుకే ముందుగా విద్యపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికాడు.స్నేహితులలో దాగి ఉన్న శత్రువులను గుర్తించడం తెలివైన పని అని ఆయన పేర్కొన్నారు. ఇది తెలిసినవారు తప్పక జీవితంలో ఉన్నత స్థాయికి చేరతారని చెప్పారు. తొందరపాటు నిర్ణయాలు ప్రమాదకరమని, ఎప్పుడూ జాగ్రత్తగా అడుగులు వేయాలని చాణక్యుడు సూచించాడు.