
World Dance Day: జార్జెస్ నోవెర్ జయంతినే వరల్డ్ డ్యాన్స్ డేగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతేడాది ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.
నృత్య కళ విశిష్టత, అనేక రకాల నృత్య శైలుల ప్రాముఖ్యత, వాటి వల్ల కలిగే లాభాలపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ దినోత్సవ ఉద్దేశ్యం.
ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వివిధ నృత్య కార్యక్రమాలు, పోటీలు, వర్క్‌షాపులు నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
ఈ ప్రత్యేక దినోత్సవాన్ని 'బ్యాలెట్ తండ్రి'గా గుర్తింపొందిన ప్రముఖ నృత్యకారుడు జార్జెస్ నోవెరేకి అంకితం చేస్తారు. జార్జెస్ నోవెర్ 1727 ఏప్రిల్ 29న జన్మించారు.
ఆయనకు నివాళిగా 1982లో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ (ITI) నృత్య విభాగం ఈ రోజును అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా ప్రకటించింది.
అప్పటి నుంచీ ఈ రోజు నృత్య కళను గౌరవించేందుకు, ప్రోత్సహించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది.
Details
నృత్యం ద్వారా వ్యక్తిత్వ వికాసం
నోవెర్ రచించిన 'లెటర్స్ ఆన్ ది డాన్స్' అనే గ్రంథం నృత్యాన్ని అర్థం చేసుకోవాలనుకునే వారికి ఓ మార్గదర్శిగా నిలుస్తోంది.
ఇందులో నృత్యానికి సంబంధించిన తత్త్వాలు, విధానాలు విపులంగా వివరించారు.
ఈ పుస్తకం ద్వారా ఎవరైనా నృత్యాన్ని నేర్చుకోవచ్చన్న విశ్వాసం నాట్యం వర్గంలో ఉంది.
అంతర్జాతీయ నృత్య దినోత్సవం ద్వారా ప్రపంచ నృత్య కళాకారుల సామరస్యాన్ని పెంపొందించడం, నృత్యం ద్వారా వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్య ప్రయోజనాల గురించి జనాల్లో చైతన్యం తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంటారు.
Details
ప్రతేడాది ఒక ప్రత్యేక థీమ్
ప్రతేడాది ఈ దినోత్సవానికి ఒక ప్రత్యేక థీమ్‌ను నిర్ధారిస్తారు.
2024లో థీమ్‌గా 'నృత్య ప్రపంచంలో వారసత్వాన్ని పరిరక్షించడం, పునరుద్ధరించడం' (Preserving and Reviving Heritage in Dance) ప్రకటించారు. 2025 థీమ్‌ను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
ఈ విధంగా, అంతర్జాతీయ నృత్య దినోత్సవం నృత్య ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేస్తూ, సృజనాత్మకతకు వేదికగా నిలుస్తోంది.