ఒత్తిడిని జయించాలని అనుకుంటున్నారా? అయితే ఇవి తినండి
మానవ ఆరోగ్యానికి హాని కలిగించే జీవనశైలిలోని ప్రధాన కారకాల్లో ఒత్తిడి ఒకటి. మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని స్వల్ప, దీర్ఘకాలికంగా ఒత్తిడి ప్రభావితం చేస్తుంటుంది. చాలా మందికి వివిధ కారణాల వల్ల ఒత్తిడికి గురవడం సహజమే. అయితే ఒత్తిలో ఉన్నప్పుడు కొన్ని ఆహారాలు తింటే సమస్య మరింత జఠిలం అవుతుంది. అయితే కొన్ని ఆహారాలను తినడం ఒత్తిడిని జయించవచ్చని పోషకాహార నిపుణురాలు చెబుతున్నారు. వాటిని స్నాక్స్ రూపంలో తింటే కాస్త ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు. అయితే ఒత్తిడి సులభంగానే దరి చేరినా, నిర్లక్ష్యంగా ఉంటే దాన్ని వదిలించుకోవడం కష్టం అవుతుందని నిపుణులు అంటున్నారు.
ఒత్తిడిలో తినాల్సిన ఆహార పదర్థాలు ఇవే
1. వేరు శెనగ ఇందులో విటమిన్ B6, మెగ్నీషియం ఉంటాయి. వేరుశెనగలు తింటే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని రుజుతా అంటున్నారు. మధ్యాహ్నం వేళల్లో దీన్ని స్నాక్‌గా తీసుకోవాలని సిఫార్సు చేశారు. 2. జీడిపప్పు ఖరీదైన జీడిపప్పును ఎక్కువగా మసాలా వంటల్లో ఉపయోగిస్తారు. అందుకే దీన్ని ఎక్కువగా వంటగదిలో నిల్వ ఉంచుకుంటారు. అయితే బయటకువెళ్లిన సందర్భాల్లో గుప్పెడు జీడిపప్పు గింజలను వెంట తీసుకెళ్లడం మంచిదని రుజితా వివరించారు. నిద్రకు ముందు పాలతో తీసుకుంటే చక్కటి నిద్రపస్తుందన్నారు.ఐరన్,మెగ్నీషియం ఇందులో పుష్కలంగా ఉంటాయన్నారు. 3. ఎండు కొబ్బరి ఒత్తిడిలో ఎండు కొబ్బరి స్వీకరిస్తే తృప్తిగా ఉంటుందని, బెల్లంతో తిన్నా మనసు ఆహ్లాదకరంగా మారుతుందన్నారు.మధ్యాహ్న భోజనంలో చట్నీ రూపంలోనూ దీన్ని తీసుకోవచ్చన్నారు. ఇందులోని లారిక్ యాసిడ్ చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు.