LOADING...
Motivation: జీవితం ఆనందంగా సాగాలంటే ఈ ఏడు పొరపాట్లు చేయకండి!
జీవితం ఆనందంగా సాగాలంటే ఈ ఏడు పొరపాట్లు చేయకండి!

Motivation: జీవితం ఆనందంగా సాగాలంటే ఈ ఏడు పొరపాట్లు చేయకండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2025
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయులు ఎకనామిక్స్‌, మ్యాథమేటిక్స్‌, మెడికల్‌ సైన్స్‌ వంటి ప్రతి రంగంలోనూ తమ ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నారు. పూర్వకాలంలో రాజులు చాణక్య విధానాల ఆధారంగా రాజ్య పాలనను సమర్థంగా నిర్వహించేవారు. చాణక్యుడు చెప్పిన జీవన సూత్రాలు మనిషి జీవితాన్ని ఆనందమయంగా, సాఫల్యభరితంగా మారుస్తాయి. ఆయన సూచించిన కొన్ని విషయాల్లో మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోకూడదని హెచ్చరించారు. అవి ఏమిటో చూద్దాం.

Details

 1. అగ్నిని తాకరాదు 

హిందూ ధర్మంలో అగ్నిని అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అగ్నిని దేవతగా భావించి, శుభకార్యాల్లో సాక్షిగా ప్రమాణం చేస్తారు. పొరపాటునైనా అగ్నిని తాకడం అనేది అనర్థాలకు దారితీస్తుందని చాణక్యుడు హెచ్చరించారు. కాబట్టి అగ్నికి ఎల్లప్పుడూ గౌరవంతో దూరంగా ఉండాలి. 2. పెళ్లికాని అమ్మాయిని తాకరాదు చాణక్య నీతి ప్రకారం పురుషుడు పెళ్లికాని అమ్మాయిని తాకడం తగదు. కన్యను దేవతతో సమానంగా పరిగణిస్తారు. అనుకోకుండా తాకినపుడు వెంటనే క్షమాపణలు చెప్పకపోతే దుష్ఫలితాలు ఎదురవుతాయని ఆయన సూచించారు.

Details

 3. గురువును అవమానించరాదు 

హిందూ సాంప్రదాయంలో గురువు తల్లిదండ్రుల కంటే ఉన్నత స్థానం కలవాడు. ఆధ్యాత్మిక గురువును ఎల్లప్పుడూ గౌరవించాలి. గురువుతో ఆటపట్టడం, అవమానించడం వంటివి తీవ్రమైన అనర్థాలకు కారణమవుతాయని చాణక్యుడు చెప్పారు. 4. బ్రాహ్మణులను గౌరవించాలి సమాజంలో బ్రాహ్మణుల స్థానం ఎంతో గౌరవనీయమైనది. వారిని నిందించడం, తక్కువగా చూడడం లేదా వివాదం పెట్టుకోవడం తప్పు. బ్రాహ్మణుల గౌరవాన్ని కాపాడడం ధర్మంగా భావించాలి అని చాణక్యుడు వివరించారు. 5. పెద్దవారిని ఎల్లప్పుడూ గౌరవించాలి ఇంట్లో పెద్దవారి అనుభవం, ఆశీర్వాదం ఇంటి శ్రేయస్సుకు మూలం. వారిని అవమానించడం లేదా విబేధాలు పెట్టుకోవడం ఇంట్లో శాంతి, ఆనందాన్ని దూరం చేస్తుందని చాణక్యుడు చెప్పారు.

Details

6. పిల్లలను అనవసరంగా కొట్టరాదు

హిందూ ధర్మం ప్రకారం పిల్లలు భగవంతుని స్వరూపంగా భావించబడతారు. చిన్న తప్పులకు పిల్లలపై ఆగ్రహం చూపకూడదు. వారిని ప్రేమతో మార్గనిర్దేశం చేయాలని చాణక్యుడు సూచించారు. 7. ఆవును ఎప్పుడూ కొట్టరాదు ఆవును హిందూ మతంలో తల్లిగా పూజిస్తారు. ఆమె పాలు పవిత్రమైనవిగా భావిస్తారు. కాబట్టి ఆవుపై హింస చేయకూడదు. పొరపాటున అలాంటి తప్పు జరిగితే పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని చాణక్యుడు తెలిపారు. చాణక్య నీతి ప్రకారం ఈ సూత్రాలను పాటిస్తే జీవితం ధార్మికతతో, శాంతితో, శ్రేయస్సుతో నిండిపోతుంది