ప్రేరణ: గడిచిన నిన్న గురించి ఆలోచించడం కన్నా రాబోయే రేపు గురించి పనిచేయడం ఉత్తమం
గడిచిపోయిన దాని గురించి ఆలోచించడం కరెక్ట్ కాదని అందరికీ తెలుసు. అయినా కూడా పదే పదే అప్పడు అలా చేసుండకపోతే బాగుండేది, ఇప్పుడిలా ఉండేవాడిని కాదు అనుకుంటూ ఫీలవుతారు. గతంలో చేసిన ఏదో ఒక తప్పు గురించే పదే పదే ఆలోచిస్తూ ఈరోజు చేయాలసిన పనిని మర్చిపోతారు. ఇలాంటి వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు ఈరోజు కూడా చేస్తున్నారు. నిన్న లక్ష రూపాయలు పోయాయనుకుందాం. ఈరోజు దాని గురించి ఆలోచిస్తూ ఆఫీసుకు వెళ్ళలేదు. 1000రూపాయల జీతం కట్ ఐపోయింది. లక్ష రూపాయల మీద బెంగతో పది రోజులు ఆఫీసుకు వెళ్ళలేదు. అంటే 10వేలు కట్ ఐపోయిందన్నట్టే. అంతేకాదు ఎక్కువ ఆలోచించడం వల్ల మనశ్శాంతి కూడా పోతుంది.
నిన్నటి గురించి ఆలోచిస్తే నేడు దూరమవుతుంది
ప్రేమించిన పెళ్ళి చేసుకున్నవారు కూడా ఇలాంటి తప్పే చేస్తారు. అప్పుడేదో ఆవేశంలో పెళ్ళి చేసుకుంటారు. ఆ తర్వాత చేసుకున్నవాడు సరిగ్గా లేకపోయే సరికి ఎందుకు చేసుకున్నానా అని బాధపడతారు. ఇలా గతం గురించి ఆలోచించే వాళ్ళు ఒకానొక దశలో తమ బ్రతుకింతే అనుకుని నిరుత్సాహ పడతారు. అలా అనుకోవడమే మొదటి తప్పు. గతం గురించి వదిలేసి ఇప్పటి గురించి ఆలోచిస్తూ పనిచేసుకుంటూ వెళ్తే అందమైన రేపు మీకు స్వాగతం పలుకుతుంది. నిన్నటి గురించి ఆలోచిస్తే ఈరోజును కోల్పోతావు. ఈరోజు పనిచేస్తే రేపు అనేది అందంగా మారుతుంది. నీకేదీ కావాలో నువ్వే నిర్ణయించుకో. ఈరోజు హ్యాపీగా పనిచేసుకుంటూ అందమైన రేపటి కోసం కలలు కంటావా? లేదంటే అందమైన ఈరోజును వదిలేసుకుని నిన్నటి గురించి బాధపడతావా?