LOADING...
Dondakaya perugu pachadi recipe: దొండకాయ పెరుగు పచ్చడి స్పెషల్.. ఇలా చేస్తే రుచి డబుల్
దొండకాయ పెరుగు పచ్చడి స్పెషల్.. ఇలా చేస్తే రుచి డబుల్

Dondakaya perugu pachadi recipe: దొండకాయ పెరుగు పచ్చడి స్పెషల్.. ఇలా చేస్తే రుచి డబుల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 21, 2026
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

దొండకాయ పెరుగు పచ్చడి రుచిగా రావాలంటే ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇవి కొంతసేపు ఫ్యాన్ కింద ఆరబెడితే పచ్చడి రుచికి మరింత మెరుగుదల వస్తుంది. కాబట్టి ఈ చిన్న టిప్ తప్పక పాటించాలి. తర్వాత గ్యాస్‌పై పెనం పెట్టి కొద్దిగా నూనె వేడి చేసి, అందులో దొండకాయ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకు బాగా వేయించాలి. వేయించిన తరువాత వాటిని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు నాలుగు కప్పుల పెరుగు తీసుకుని, అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి మజ్జిగలా చేసుకోవాలి. దానిలో ముందుగా మిక్సీలో తయారుచేసుకున్న మసాలా పేస్ట్, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి

Details

తాలింపును పచ్చడిలో కలిపితే మరింత రుచి

ఈ మిశ్రమాన్ని మళ్లీ దొండకాయలను వేయించిన పెనంలో పోసి, మీడియం మంటపై తక్కువ ఫ్లేమ్‌లో సుమారు 10 నిమిషాల పాటు ఉడికించాలి. దొండకాయ ముక్కలకు పెరుగు బాగా పట్టే వరకు కలుపుతూ ఉంచాలి. చివరగా తాలింపు కోసం కొద్దిగా నూనె వేడి చేసి, అందులో 5 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా ఇంగువ, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. ఈ తాలింపును పచ్చడిలో కలిపితే రుచి మరింత పెరుగుతుంది. వేసవి కాలంలో ఈ దొండకాయ పెరుగు పచ్చడి చల్లగా, రుచిగా ఉండే బెస్ట్ వంటకం. ఒకసారి ఇలా తయారుచేస్తే తప్పకుండా అందరికీ నచ్చుతుంది.

Advertisement