మీకు సముద్రం అంటే ఇష్టమా? అయితే ఇండియాలోని ఈ ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి
చాలామందికి సముద్రం అంటే ఏదో తెలియని ఇష్టం ఉంటుంది. సముద్రపు అలల చప్పుళ్ళు, సూర్యాస్తమయం సమయంలో నీటిలోకి సూర్యుడు వెళ్లిపోవడం వంటి దృశ్యాలు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. సముద్ర తీరంలో మీకు ప్రియమైన వారితో కూర్చుని పైన చెప్పుకున్న అనుభవాన్ని ఆస్వాదిస్తుంటే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. మీక్కూడా సముద్రం అంటే ఇష్టముంటే భారతదేశంలోని అందమైన సముద్ర తీర ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోవా: బ్యాచిలర్స్ నుండి మొదలుకొని వయసు పైబడిన వారికి సైతం సముద్రం అనగానే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు గోవా. ఇక్కడ చాలా బీచ్ లు ఉంటాయి. వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ గేమ్స్, గోవా సంస్కృతి సాంప్రదాయాలు మిమ్మల్ని ఆనందింపజేస్తాయి.
పాండిచ్చేరి
ఫ్రెంచ్ సామ్రాజ్యపు ఆనవాళ్లు పాండిచ్చేరిలో ఎక్కువగా కనిపిస్తాయి. పాండిచ్చేరి ప్రాంతం చూడడానికి చాలా కొత్తగా ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో పాండిచ్చేరి ప్రాంతాన్ని సందర్శించవచ్చు. కేరళ: సముద్రపు బ్యాక్ వాటర్, పడవ ప్రయాణాలు, తీరప్రాంత అందాలను అనుభవించాలంటే కేరళ వెళ్లాల్సిందే. మలయాళీ ప్రజల సంస్కృతి మీకు కొత్తగా అనిపించడంతోపాటు అద్భుతంగా ఉంటుంది. అండమాన్ నికోబార్ దీవులు: స్వచ్ఛమైన సముద్రపు నీటిని కలిగి ఉండే అండమాన్ నికోబార్ సముద్రతీరాలు మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తాయి. ఇక్కడి సముద్రతీరాలు చాలా పరిశుభ్రంగా ఉంటాయి. ముంబై: సముద్రతీరం పక్కనే సిటీని చూడాలని కోరిక మీకుంటే ముంబై వెళ్లాల్సిందే. ముంబై నగరంలో జుహు బీచ్ చాలా ఫేమస్. సాయంత్రం పూట ఎంతోమంది ఈ బీచ్ కు వస్తుంటారు.