LOADING...
ABC Juice: ఏబిసి జ్యూస్ 30 రోజులు తాగండి.. మీ శరీరంలో జరిగే మార్పులు గమనించండి 
ఏబిసి జ్యూస్ 30 రోజులు తాగండి.. మీ శరీరంలో జరిగే మార్పులు గమనించండి

ABC Juice: ఏబిసి జ్యూస్ 30 రోజులు తాగండి.. మీ శరీరంలో జరిగే మార్పులు గమనించండి 

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 05, 2025
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏబిసి జ్యూస్ రుచికరమైన, తేలికగా తయారు చేసుకోవచ్చే హెల్తీ డ్రింక్. ఇది ఆపిల్, బీట్రూట్, క్యారెట్ కలిపి తయారు చేసే ఓ పోషకాహార జ్యూస్. ఈ మూడు పదార్థాలు రంగులతో పాటు పోషకాలు కూడా సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఈ జ్యూస్ తాగగానే రిఫ్రెషింగ్ ఫీలింగ్ కలుగుతుంది. రోజూ ఒక గ్లాస్ తాగండి - అద్భుత మార్పులను చూడండి! ఈ మూడింటినీ కలిపి చేసే ఏబీసీ జ్యూస్‌ను నెలరోజుల పాటు ప్రతిరోజూ ఒక గ్లాస్ తాగితే మీ ఆరోగ్యంలో గమనించదగిన మార్పులు కనిపిస్తాయి. మీ శరీరానికి కావాల్సిన కీలకమైన పోషకాలు అందుతాయి, శక్తి పెరుగుతుంది, ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Details

ఏబిసి జ్యూస్‌లోని పోషకాలు 

ఆపిల్, క్యారెట్, బీట్రూట్ మూడింటిలోనూ విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆపిల్స్ - విటమిన్‌లు, ఫైబర్ అధికంగా ఉండి ఆరోగ్యాన్ని సమర్థంగా కాపాడతాయి. బీట్రూట్ - నైట్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. క్యారెట్లు - విటమిన్ ఏ అధికంగా ఉండి కంటి చూపుని మెరుగుపరచడమే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి. నెల రోజుల పాటు తాగితే కలిగే ప్రయోజనాలు ఈ ఏబీసీ జ్యూస్‌ను నెల రోజులు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం మారుతున్న వాతావరణానికి త్వరగా అలవాటు పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో నిల్వ ఉంటాయి, దీంతో తెల్ల రక్త కణాల ఉత్పత్తి మెరుగవుతుంది.

Details

చర్మ ఆరోగ్యానికి ఏబీసీ జ్యూస్ 

ఆపిల్, క్యారెట్, బీట్రూట్ ఈ మూడు పదార్థాలు చర్మాన్ని సహజంగా అందంగా మార్చేందుకు సహాయపడతాయి. ఇవి చర్మంలోని టాక్సిన్స్‌ను తొలగించి మురికిని బయటకు పంపి, కాంతివంతమైన రూపాన్ని ఇస్తాయి. బరువు తగ్గే వారికి ఉపయోగకరం ఈ జ్యూస్ తక్కువ క్యాలరీలు కలిగి ఉండటంతో బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తాగడం ద్వారా మంచి ప్రయోజనం పొందుతారు. హై ఫైబర్ గుణం వల్ల పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది, తద్వారా అదనపు ఆహారం తినకుండా నియంత్రించుకోవచ్చు.

Details

 జీర్ణక్రియ మెరుగుపరిచే మిరాకిల్ జ్యూస్ 

ఈ ఏబీసీ జ్యూస్‌లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మిరాకిల్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు ఆపిల్‌లో ఉండే పెప్టిన్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బీట్రూట్‌లో నైట్రేట్లు ఉండటంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. క్యారెట్ లోని యాంటీ ఆక్సిడెంట్లు ధమనుల్లో అడ్డంకులను రాకుండా నిరోధిస్తాయి.

Details

 డయాబెటిస్ ఉన్నవారు జాగ్రత్తగా తాగాలి 

ఈ జ్యూస్ సహజ చక్కెరలతో కూడినదిగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. సాధారణంగా ఆరోగ్యవంతులైన వ్యక్తులు ఒక గ్లాస్ తాగితే, డయాబెటిస్ ఉన్నవారు అర గ్లాస్ మాత్రమే తాగాలి. అలెర్జీ ఉంటే తాగడం మానేయాలి ఈ జ్యూస్ తాగిన తర్వాత చర్మంపై దురద, వాపు, దద్దుర్లు లేదా పొట్టలో అసౌకర్యంగా అనిపిస్తే, మీకు ఇందులో ఏదైనా పదార్థానికి అలెర్జీ ఉన్నట్లు భావించాలి. అలాంటి సందర్భాల్లో దీన్ని తాగడం మానేయడం ఉత్తమం.