LOADING...
Health Care:పేపర్ కప్స్‌లో కాఫీ, టీ తాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం
పేపర్ కప్స్‌లో కాఫీ, టీ తాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం

Health Care:పేపర్ కప్స్‌లో కాఫీ, టీ తాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2025
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్లాస్టిక్ కప్పుల స్థానంలో పేపర్ కప్పులు వాడటం పర్యావరణ హితం అయినా, ఆరోగ్యానికి సవాళ్లను తీసుకురావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది ఈ మధ్యకాలంలో వేడి కాఫీ, టీ కోసం ప్లాస్టిక్ కప్పులను మానుకుని పేపర్ కప్పులను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పేపర్ కప్పులలోనూ మైక్రోప్లాస్టిక్, రసాయన పదార్థాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉండవచ్చని సూచించారు.

Details

ముఖ్యమైన అంశాలు

1. మైక్రోప్లాస్టిక్ లీకేజ్ పేపర్ కప్పులు పూర్తిగా పేపర్‌తో తయారు కావు. లీకేజ్ నివారించేందుకు వీటికి పాలిథిన్ పూత ఉంటుంది. వేడి పానియాలు కప్పులో ఉన్న మైక్రోప్లాస్టిక్‌ను విడుదల చేసి, కొన్ని రకాల రసాయనాలను పానియంలో కలుస్తాయి. 2. ప్రింటింగ్ ఇంక్‌ల ప్రభావం ఆకర్షణీయమైన ప్రింట్‌ల కోసం ఉపయోగించే ఇంక్‌లు వేడి కాఫీ, టీలో కలిశే అవకాశం ఉంది. ఇవి ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు. 3. హానికర లోహాల ముప్పు కొన్ని చౌక పేపర్ కప్పుల్లో సీసం, క్రోమియం వంటి హానికర లోహాలు ఉండే అవకాశం ఉంది. ఇవి శరీరంలోకి ప్రవేశించి వివిధ ఆరోగ్య సమస్యలను తేవచ్చు.

Details

4. హార్మోన్లపై ప్రభావం

పేపర్ కప్పులలోని ప్లాస్టిక్ పూతలోని రసాయనాలు ఎండోక్రైన్ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాల ప్రభావం ఫెర్టిలిటీ, మెటబాలిజం, ఇమ్మ్యూనిటీ వ్యవస్థపై ప్రతికూలం కావచ్చు. 5. జీర్ణ సమస్యలు మైక్రోప్లాస్టిక్ శరీరంలోకి చేరితే గట్ మైక్రోబయోమ్ దెబ్బతింటుంది. ఫలితంగా జీర్ణ సమస్యలు, పోషకాలు శోషణలో లోపం లాంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఎందుకు భద్రతా మార్గం పేపర్ కప్పులు పర్యావరణానికి మంచే అయినప్పటికీ, ఆరోగ్యానికి రిస్క్ తీసుకోవడం అవసరం లేదు. అందుకే, స్టెయిన్‌లెస్ స్టీల్, గాజు లేదా సిరామిక్ కప్పులను ఉపయోగించడం ఉత్తమం. ఇవి సురక్షితంగా ఉంటాయి, దీర్ఘకాలం ఉపయోగించుకోవచ్చు.