Page Loader
Hot Water: చలికాలంలో వేడి నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఇవే..! 
చలికాలంలో వేడి నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఇవే..!

Hot Water: చలికాలంలో వేడి నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఇవే..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2025
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

వేడి నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమని నిపుణులు చెబుతారు. గొంతు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలకు వేడి నీరు ఉపశమనం ఇస్తుందని వారు సూచిస్తున్నారు. దీన్ని అనుసరించి చాలామంది రోజూ వేడి నీటిని ఎక్కువగా తాగడం అలవాటు చేసుకుంటారు. ముఖ్యంగా చలికాలంలో వేడి నీటిని ఎక్కువగా తీసుకోవడం సాధారణం. అయితే, వేడి నీటిని అధికంగా తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి నీటిని అధికంగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు 

వేడి నీటిని అధికంగా తాగడం వల్ల కలిగే సమస్యలు

1. డీహైడ్రేషన్‌: శరీరం సరైన రీతిలో హైడ్రేటెడ్‌గా ఉండాలంటే తగినంత నీటిని తాగడం అవసరం. కానీ వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో చమట ఎక్కువగా వస్తుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురిచేస్తుంది. అందుకే వేడి నీటిని పరిమితంగా తాగడం మంచిది. 2. జీర్ణ సమస్యలు: వేడి నీటిని అధికంగా తీసుకోవడం పొట్టకు హానికరమని నిపుణులు అంటున్నారు. ఇది కడుపులో జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తుంది. కడుపు చికాకు, జీర్ణక్రియ లోపాలు కలగటంతో పాటు గొంతు సమస్యలు కూడా ఎదురవుతాయి. అందువల్ల వేడి నీటిని పరిమితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వివరాలు 

వేడి నీటిని అధికంగా తాగడం వల్ల కలిగే సమస్యలు

3. దంత సమస్యలు: వేడి నీటిని ఎక్కువగా తాగడం దంతాలపై ప్రభావం చూపుతుంది. దంతాలపై ఉన్న ఎనామిల్ దెబ్బతిని, దంతాలు సున్నితంగా మారుతాయి. దీని ద్వారా కావిటీల ప్రమాదం పెరుగుతుంది. అందుకే వేడి నీటిని తగిన స్థాయిలోనే తాగడం ఉత్తమం.

వివరాలు 

వేడి నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

1. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం: ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం చాలా మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను సక్రమంగా నిర్వహిస్తుంది. 2. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం:వేడి నీటిని తాగడం ద్వారా గొంతు నొప్పి, జలుబు, న్యూమోనియా వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.దగ్గు,పడిశం ఉన్నవారు ఉదయాన్నే వేడి నీటిని తాగితే మంచి ఉపశమనం పొందుతారు. 3. ఆర్థరైటిస్‌కు ఉపశమనం:ఆర్థరైటిస్ సమస్యలు ఉన్నవారు వేడి నీటిని తాగడం ద్వారా నొప్పి తగ్గుతుంది. ఇది శరీరానికి సౌకర్యంగా అనిపిస్తుంది. ముప్పు లేకుండా ఉపయోగించుకోండి:వేడి నీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతుంది. అత్యధికంగా వేడి నీటిని తాగడం అనారోగ్యానికి దారి తీస్తుందనే విషయం గుర్తుంచుకోండి.