
Water: వేసవి తాపం నుంచి రక్షణ కల్పించే నీరు.. భానుడి భగభగలకు సరైన విరుగుడు!
ఈ వార్తాకథనం ఏంటి
ఎండలు రోజురోజుకూ పెరుగుతున్న ఈ కాలంలో,భానుడి భగభగలకుసరైన విరుగుడు మంచి నీరు. శరీరాన్ని తాపం నుండి రక్షించడంలో ఇతర పానీయాల కంటే శుద్ధమైన నీరే ఎంతో ఉపయోగకరమని పరిశోధనలు చెబుతున్నాయి. నీరు శరీరానికి ఎందుకు అవసరం? మన శరీరం మొత్తం బరువులో దాదాపు 70శాతం వరకు నీరు ఉంటుంది. ఇది మన జీవనానికి అనివార్యం. ముఖ్యమైన ప్రయోజనాలు: శరీరంలోని ప్రతి కణం, అవయవానికి సరిపడా నీరు అవసరం. మూత్రం,చెమట,మల రూపంలో వ్యర్థాలను బయటకు పంపే ప్రక్రియలో సహాయపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో కీలకం. కీళ్లకు కుషన్‌లా పని చేస్తుంది,మృదుత్వాన్ని ఇస్తుంది. సున్నితమైన కణజాలాలకు రక్షణ కల్పిస్తుంది. నోటిలో లాలాజలాన్ని ఉత్పత్తి చేయటానికి అవసరం. బరువు తగ్గించుకోవడంలో తోడ్పడుతుంది. రక్తంలో ఆక్సిజన్‌ను మెరుగుపరచడంలో సహాయకారి.
వివరాలు
ఎంత మోతాదులో నీరు తాగాలి?
నీటి అవసరం వ్యక్తుల ఆరోగ్య స్థితిని బట్టి మారుతుంది. ఆరోగ్య మార్గదర్శకాలు: రోజుకు 2-3లీటర్లు నీరు తాగాలి. అమెరికా నేషనల్ అకాడమీస్ సూచన: పురుషులు.. 3.7లీటర్లు మహిళలు.. 2.7లీటర్లు సాధారణంగా 8-10 గ్లాసులు నీళ్లు తాగమని నిపుణులు సూచిస్తున్నారు. నీటి మూలాలు ఎక్కడి నుంచీ వస్తాయి? శరీరం అవసరమైన ద్రవాల్లో 20శాతం ఆహారం ద్వారానే లభిస్తుంది. వాటి ఉదాహరణలు: పుచ్చకాయ,కీర వంటి పండ్లలో అధిక నీటి శాతం ఉంటుంది. టీ, కాఫీలు ఎక్కువగా తీసుకుంటే స్వల్ప డైయూరిటిక్ ప్రభావం ఉంటుంది. శీతల పానీయాలు,ఎనర్జీ డ్రింక్స్ ప్రయోజనకరంగా ఉండవు.వీటిలో చక్కెర, కెఫిన్ అధికంగా ఉంటుంది. మద్యం కూడా డైయూరిటిక్‌గా పని చేస్తుంది.శరీరంలో నీరు కోల్పోతారు. అందువల్ల సాధారణ మంచినీరు తాగడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి.
వివరాలు
నీటి సమతౌల్యతను శరీరం ఎలా కాపాడుతుంది?
శరీరం ద్రవ సమతౌల్యతను నియంత్రించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థలు పనిచేస్తాయి ADH హార్మోన్ RAAS వ్యవస్థ (రెనిన్-ఆంజియోటెన్సిన్-ఆల్డోస్టెరాన్) ఈ రెండు కలిసి: మూత్రాన్ని చిక్కగా మార్చి చెమట ఉత్పత్తిని తగ్గించి శరీరంలో నీటి నిల్వను పెంచతాయి. కాబట్టి, తక్కువ నీరు తాగినా కొంతసేపు శరీరం సాదారణంగా పనిచేస్తుంది. నీటి అవసరం వ్యక్తిపరంగా ఎలా మారుతుంది? వివిధ సందర్భాల్లో నీటి అవసరం: పొలాల్లో కష్టపడే రైతుకు,ఏసీలో కూర్చుని పని చేసే వ్యక్తితో పోల్చితే ఎక్కువ నీరు అవసరం. వేడి, తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాలు, ఎత్తైన ప్రాంతాల్లో ఉండేవారు ఎక్కువ నీటిని తీసుకోవాలి. క్రీడాకారులు,శారీరక శ్రమ ఎక్కువగా చేసే వాళ్లూ మరింత నీటిని తాగాలి. శరీరం ఇచ్చే దాహ సంకేతాలను గమనించి వెంటనే స్పందించాలి.
వివరాలు
తాగకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి?
నీటి లోపం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. ఇది శరీర పనితీరును ప్రభావితం చేస్తుంది. డీహైడ్రేషన్‌లో వచ్చే లక్షణాలు: శక్తి తగ్గిపోతుంది విషయగ్రహణ సామర్థ్యం తగ్గుతుంది ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి తలనొప్పి, కళ్లు తిరగడం, వడదెబ్బ, మలబద్ధకం మూత్రపిండాలు, చర్మంపై ప్రభావం నీటిని ఎప్పుడు తాగాలి? ముఖ్య సమయాలు: దాహం వేసినప్పుడు భోజనానికి ముందు,తర్వాత వ్యాయామానికి ముందు,తర్వాత జ్వరం, వాంతులు, డయేరియా వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నపుడు గర్భిణులు, పాలిచ్చే తల్లులు మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, రాళ్లు ఉన్నవారు.. వైద్యుల సలహా మేరకు త్రాగాలి
వివరాలు
ఎక్కువ నీరు తాగితే ఏమవుతుంది?
అధికంగా నీరు తాగితే హైపోనట్రేమియా అనే స్థితి రావచ్చు. ఇది రక్తంలో సోడియం స్థాయిని తగ్గిస్తుంది. దాని వల్ల: వాంతులు, తిమ్మిరి, అలసట తరచూ యూరిన్ వెళ్తే ఎలక్ట్రోలైట్‌లు పడిపోతాయి కండరాల తిమ్మిరి, కాళ్లలో మంట, ఛాతీలో నొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. సరిపడా నీరు తాగితే లాభాలు: తక్కువగా దాహం వేస్తుంది మూత్రం స్పష్టంగా లేత పసుపు రంగులో ఉంటుంది శరీర వ్యవస్థలు సమతుల్యంగా పనిచేస్తాయి మీ శరీరం నీటి కోసం సహజంగా సంకేతాలు ఇస్తుంది. వాటిని గమనించండి, స్పందించండి — ఆరోగ్యంగా జీవించండి!