
Watermelon: వేసవి తాపం నుంచి తట్టుకోవాలంటే.. పుచ్చకాయలను విడిచిపెట్టకుండా తినాల్సిందే.. ఎందుకంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి కాలంలో శరీరానికి చలువను కలిగించే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ఎంతో అవసరం. ఈ కాలంలో వేసవి తాపం నుంచి తట్టుకోవాలంటే, చలువ చేసే ఆహారాలను తినాలి. ఇలాంటి వేళ, చల్లదనం ఇచ్చే పుచ్చకాయలు మనకు సహాయపడతాయి. వేసవి అంటేనే ముందుగా మనకు గుర్తొచ్చే పండు పుచ్చకాయ. ఈ సీజన్‌లో మార్కెట్లలో, రోడ్డుపక్కన అన్నిచోట్లా పుచ్చకాయలే కనిపిస్తాయి. చాలామంది ఈ పండును నేరుగా ముక్కలుగా కట్ చేసి తింటారు, మరికొంతమంది జ్యూస్ లేదా సలాడ్స్ రూపంలో ఆస్వాదిస్తారు. ఎలా తిన్నా సరే, ఇది శరీరానికి అనేక విధాలుగా లాభం చేస్తుంది. ఆరోగ్య నిపుణులు సైతం వేసవిలో ప్రతి రోజు పుచ్చకాయ తినాలని సలహా ఇస్తున్నారు.
వివరాలు
బరువు తగ్గేందుకు సహాయపడుతుంది
100 గ్రాముల పుచ్చకాయలో కేవలం 16 క్యాలరీల శక్తి మాత్రమే ఉంటుంది. ఇందులో రెండు గ్రాముల ప్రోటీన్, 3.3 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.2 గ్రాముల కొవ్వు, 0.6 గ్రాముల పీచు, 27.3 మిల్లీగ్రాముల సోడియం, 160 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటాయి. అంతేకాకుండా, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఈ పండులో సమృద్ధిగా ఉంటాయి. తక్కువ క్యాలరీలతో తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది, తద్వారా భోజనం తగ్గించవచ్చు. ఆకలి వేయకపోవడంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండును ప్రతి రోజు తినడం మంచిది.
వివరాలు
గుండె, కిడ్నీల ఆరోగ్యానికి మేలు
పుచ్చకాయలో అధికంగా ఉన్న పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది బిపి నియంత్రణకు దోహదపడుతుంది. హైబిపి ఉన్నవారు ఈ పండును తరచూ తీసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు. మూత్రాశయ సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు లేదా కిడ్నీ రాళ్లు ఉన్నవారు పుచ్చకాయను లేదా దాని రసాన్ని తీసుకుంటే అవి తగ్గే అవకాశం ఉంది. ఇది కిడ్నీలను శుభ్రంగా ఉంచుతుంది. వ్యర్థాలు బయటకు పంపుతుంది. కిడ్నీ రాళ్లను కరిగిస్తుంది. పుచ్చకాయలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి కణాల నాశనం నివారిస్తాయి. ఇది క్యాన్సర్ మరియు గుండెపోటు వంటి వ్యాధులను దూరంగా ఉంచుతుంది.
వివరాలు
వేసవి వేడిని తగ్గిస్తుంది
వేసవిలో శరీరంలో వేడి స్థాయి పెరుగుతుంది. డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. శరీరంలోని ద్రవాలు త్వరగా కోల్పోతాము. ఇలాంటి సమయంలో పుచ్చకాయను తినడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. ఇది వేడిని బయటకు పంపిస్తుంది. ఎండబారిన చర్మం ఎర్రగా, నల్లగా మారుతుంది. అలాంటి వారికి పుచ్చకాయ తినడం వల్ల చర్మాన్ని రక్షించుకోవచ్చు. రంగు మారకుండా, తేమను నిలుపుకోవచ్చు. పుచ్చకాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేసవి సీజన్‌లో ఈ పండును మన రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఆరోగ్యం పరిరక్షణతో పాటు వేడి నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ పండును నిర్లక్ష్యం చేయకుండా తినాలి.