
Diabetes: డయాబెటిస్ కంట్రోల్ చేసేందుకు ఈ కూరగాయాలను తినాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
మధుమేహం ఉన్నవారికి ప్రత్యేక ఆహారం అవసరం. డయాబెటిస్ ఒక జీవనశైలి వ్యాధిగా అభివర్ణించవచ్చు.
ఎందుకంటే ఇది సరైన ఆహార అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల ఎక్కువగా వస్తుంది.
ఈ వ్యాధి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కాని లేదా ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
దీనివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు కొన్ని కూరగాయలను తమ ఆహారంలో చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయగలుగుతారు.
డయాబెటిస్ లక్షణాలు
అధిక దాహం, నీళ్లు తాగినా తక్కువే దాహం
ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయడం
బరువు తగ్గడం
Details
డయాబెటిస్ ఉన్నవారికి తినాల్సిన 5 ముఖ్యమైన కూరగాయలు
1. క్యారెట్
క్యారెట్లలో ఉండే విటమిన్ A, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి.
క్యారెట్ తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగి ఉండి, రక్తంలో చక్కెర పెరగకుండా నివారిస్తుంది.
2. పాలకూర
పాలకూరలో ఐరన్, విటమిన్ C, ఫోలేట్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
పాలకూరలో తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ ఉండటం వల్ల ఇది డయాబెటిస్ రోగులకు అనుకూలం.
Details
3. టర్నిప్
టర్నిప్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది. దీనిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఇది డయాబెటిస్ పేషెంట్లకు ఉత్తమం.
4. బీట్ రూట్
బీట్ రూట్‌లో విటమిన్ C, ఐరన్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
వీటి ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బీట్ రూట్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండి, రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా నిరోధిస్తుంది.
5. కాకరకాయ
కాకరకాయలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మధుమేహం ఉన్నవారికి కాకరకాయ ను ప్రతి రెండు రోజులకు ఒకసారి తినడం ఉపయోగకరం.