NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Strawberry: స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
    తదుపరి వార్తా కథనం
    Strawberry: స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
    Strawberry: స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

    Strawberry: స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 26, 2024
    11:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మన ఫిట్‌నెస్‌లో మన ఆహారం అత్యంత ప్రభావవంతమైన ప్రధానమైనది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది.

    జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే మన శరీరం ఫిట్నెస్ కోల్పోవడం ఖాయం. ఫిట్ గా ఉండడానికి పండ్లు ఉత్తమ మార్గం. కొన్ని పండ్లు చాలా ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

    మొదటి కారణం ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం. బరువు తగ్గడానికి తక్కువ కేలరీల ఆహారం అవసరం.

    స్ట్రాబెర్రీ పండ్లలో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇప్పుడు, ఈ పండ్ల ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..

    Details

    ఆకలిని అదుపులో ఉంచే..ఫైబర్

    స్ట్రాబెర్రీలలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. ఇవి మీ బరువును తగ్గించుకోవడానికి సరైనవి.

    స్ట్రాబెర్రీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

    స్ట్రాబెర్రీలను తినడం వల్ల మీ జీవక్రియ కూడా పెరుగుతుంది. 100 గ్రాముల స్ట్రాబెర్రీలో 32 కేలరీలు మాత్రమే ఉన్నాయి.

    ఈ పండులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రోజూ కనీసం రెండు సేర్విన్గ్స్ స్ట్రాబెర్రీలను తినడంగాని లేదా స్మూతీగా డైట్‌లో చేర్చుకోవచ్చు.

    ఫైబర్ మీ ఆకలిని అదుపులో ఉంచుతుంది. కాబట్టి మీకు ఎక్కువగా ఆకలి అనిపించదు. మీరు అనారోగ్యకరమైన స్నాక్స్ తినడం కూడా మానేయవచ్చు.

    స్ట్రాబెర్రీలో చాలా నీరు ఉంటుంది. కాబట్టి ఈ పండు శరీరానికి కావలసిన శక్తిని ఇవ్వగలదు.

    Details

    స్ట్రాబెర్రీస్ లో విటమిన్లు,మినరల్స్ 

    నీటిలో ఖచ్చితంగా కేలరీలు ఉండవు, కాబట్టి శరీరాన్ని హైడ్రేట్ చేయడం మంచిది. హైడ్రేటెడ్ స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల అదనపు కేలరీలు మన శరీరంలోకి చేరకుండా నిరోధించవచ్చు.

    స్ట్రాబెర్రీస్ లో విటమిన్లు,మినరల్స్ ఉంటాయి. స్ట్రాబెర్రీలు విటమిన్ సి గొప్ప స్టోర్హౌస్.

    స్ట్రాబెర్రీలు రోగనిరోధక వ్యవస్థ కణాలకు మద్దతు ఇస్తుంది. విటమిన్-సి టి కణాలు, బి-కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇవి తెల్ల రక్త కణాలు, వ్యాధిని కలిగించే వైరస్‌లు, బ్యాక్టీరియా, క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయి.

    స్ట్రాబెర్రీలలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

    స్ట్రాబెర్రీ పండులోని నేచురల్ యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ వల్ల కలిగే మంటను తగ్గించడమే కాకుండా శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధించగలవని పరిశోధకులు సూచిస్తున్నారు.

    Details

    డయాబెటిస్‌ పేషెంట్లకు స్ట్రాబెర్రీ

    యాంటీఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఉత్తమంగా ఉంచుతాయి. స్ట్రాబెర్రీలలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

    ఈ యాంటీఆక్సిడెంట్లలో ఆంథోసైనిన్స్‌తో పాటు విటమిన్-సి ఉంటుంది. యాంటిఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి, కణజాల నష్టాన్ని తగ్గించడం ద్వారా కాలక్రమేణా దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

    స్ట్రాబెర్రీలలో సహజ చక్కెర ఫ్రక్టోజ్ తక్కువ శాతం ఉంటుంది. ఒక కప్పు స్ట్రాబెర్రీలు 7 గ్రాముల సహజ చక్కెరను అందిస్తాయి. అందుకే డయాబెటిస్‌ పేషెంట్లకు కూడా ఇది మంచి ఆహార ఎంపిక.

    Details

    స్ట్రాబెర్రీ తో నోటి సమస్యలకు చెక్‌

    స్ట్రాబెర్రీ తో కళ్ళకి,దంతాలకు మంచి ప్రయోజనాలు ఉన్నాయి. స్ట్రాబెర్రీలోని యాంటీఆక్సిడెంట్‌ గుణం కంటి శుక్లాలను నివారించడంతో, అంధత్వాన్ని దూరం చేయడంలో క్రీయశీలక పాత్ర పోషిస్తుంది.

    అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్‌ సి.. ఫ్రీరాడికల్స్‌ నుంచి కళ్లను కాపాడుతుంది.

    క్రమం తప్పుకుండా స్ట్రాబెర్రీని ఆహారంలో భాగం చేసుకుంటే నోటి సమస్యలకు కూడా చెక్‌ పెట్డవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..  టాలీవుడ్
    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్
    M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత  శాస్త్రవేత్త
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025