Egg Masks for Hair: కోడిగుడ్డుతో తయారు చేసుకున్న హెయిర్ మాస్క్‌లతో జుట్టు సమస్యలను దూరం
అనేక మంది జుట్టు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. జుట్టు ఎక్కువగా రాలిపోవడం, నష్టపోవడం, పొడిగా మారడం, చుండ్రు వంటి సమస్యలు ఇవి. సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, ధూళి వంటి కారణాల వల్ల ఇవి తలెత్తుతాయి. ఈ సమస్యలకు సమాధానంగా కోడిగుడ్లు మీ జుట్టు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. వీటిలో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండి జుట్టు సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయి. ఇంట్లోనే కోడిగుడ్లతో మాస్క్‌లు సులభంగా తయారు చేసుకోవచ్చు. కొన్ని రకాల ఎగ్ మాస్క్‌లు ఎలా తయారు చేసుకోవాలో, ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం..
1. గుడ్డు,పెరుగు మాస్క్
జుట్టు రాలే సమస్యను తగ్గించేందుకు కోడిగుడ్డు, పెరుగు కలిపిన మాస్క్ సహకరిస్తుంది. మీ జుట్టుకు తగిన మొత్తంలో పెరుగు తీసుకుని, అందులో ఒకటి లేదా రెండు గుడ్లను వేసి బాగా బీట్ చేసి పేస్ట్ తయారుచేయండి. ఈ పేస్ట్‌ను జుట్టు కుదుళ్లకు, మొత్తం జుట్టుకు రాసి, 20-30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మాస్క్ జుట్టు రాలే సమస్యను తగ్గించి, వెంట్రుకల దృఢత్వాన్ని మెరుగుపరుస్తుంది.
2. గుడ్డు, ఆలివ్ ఆయిల్ మాస్క్
పొడిగా, పీలగా ఉన్న జుట్టు కోసం గుడ్డు, ఆలివ్ ఆయిల్ మాస్క్ అద్భుతంగా పనిచేస్తుంది. రెండు గుడ్లలో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి బాగా మిక్స్ చేసి కుదుళ్ల నుండి మొత్తం జుట్టుకు రాసి, అరగంట తర్వాత తలస్నానం చేయండి. ఈ మాస్క్ జుట్టుకు తేమను అందించి మెరుపును పెంచుతుంది.
3. గుడ్డు, తేనె మాస్క్
ఈ మాస్క్ మీ జుట్టును మాయిశ్చరైజ్ చేస్తుంది. రెండు గుడ్లలో రెండు టీస్పూన్ల తేనె వేసి బాగా కలిపి, జుట్టుకు రాసుకుని 30 నిమిషాలు ఆరనివ్వండి. తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. ఈ మాస్క్ జుట్టును సహజంగా మాయిశ్చరైజ్ చేస్తుంది. 4. గుడ్డు, కొబ్బరినూనె మాస్క్ కోడిగుడ్డు, కొబ్బరినూనె కలిపి తయారుచేసే ఈ మాస్క్, జుట్టు డ్యామేజ్ అవడం, కనులు విరిగిపోవడం వంటి సమస్యలకు పరిష్కారంగా సహాయపడుతుంది. ఒకటి లేదా రెండు గుడ్లలో నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె కలిపి, ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.
5. గుడ్డు,హెన్నా మాస్క్
మూడు స్పూన్ల హెన్నా పొడిలో కాస్త నీరు వేసి పేస్ట్ తయారుచేసి, అందులో రెండు గుడ్లు, కొంత పెరుగు వేసి బాగా కలిపి, కుదుళ్ల నుండి మొత్తం జుట్టుకు రాసి అరగంట తర్వాత తలస్నానం చేయండి.