వీకెండ్ మ్యారేజ్ గురించి విన్నారా? జపాన్ లో ట్రెండ్ అవుతున్న పెళ్ళి సిస్టమ్ గురించి తెలుసుకోండి
రోజులు మారుతున్న కొద్దీ కొత్త కొత్త పద్దతులు పుట్టుకొస్తుంటాయి. అవసరాల ప్రకారం ఆచారాలు మారిపోతుంటాయి. దాన్నెవ్వరూ ఆపలేరు. ప్రస్తుతం జపాన్ లో వీకెండ్ మ్యారేజెస్ ట్రెండ్ నడుస్తోంది. దాని కథేంటో తెలుసుకుందాం. వీకెండ్ మ్యారేజ్ అంటే, కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే కలిసి ఉండడం. మిగతా వారాల్లో ఎవరి పని వాళ్ళు చూసుకోవడం. పెళ్ళిళ్ళంటే భయపడుతున్న ఈ నాటి యువత, బాద్యతలకు దూరంగా కేవలం వారాంతాలకు మాత్రమే బంధాలకు టైమ్ ఇస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు జపాన్ లో చాలా పెరుగుతోంది. స్వతంత్రంగా బతకాలనే ఆలోచనలు, సర్దుకుపోయే మనస్తత్వం తగ్గిపోవడం, సంపాదనలు పెరగడం, వీకెండ్ మ్యారేజ్ కి దారి తీస్తున్నాయి. దీనివల్ల లాభాలూ ఉన్నాయి, నష్టాలూ ఉన్నాయి.
వీకెండ్ మ్యారేజ్ వల్ల లాభాలు, నష్టాలు
కేవలం వీకెండ్స్ లోనే బంధం ఉంటుంది కాబట్టి ఇతర వారాల్లో ఇష్టమైన పని చేసుకోవచ్చు. తమ తమ పనుల్లో పూర్తిగా బిజీగా ఉండి బంధాలకు ఎక్కువ టైమ్ ఇవ్వలేరో, వాళ్ళకి వీకెండ్ మ్యారేజెస్ సరిగ్గా సరిపోతాయి. ఎక్కువ సేపు కలిసుండలేరు కాబట్టి గొడవలు కూడా తక్కువగా అవుతాయి. ఇక నష్టాల విషయానికి వస్తే, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి వీకెండ్ మ్యారేజ్ ఎన్నిరోజులు సరిగ్గా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. కలిసుండేది రెండు రోజులే కాబట్టి ఎమోషనల్ సపోర్ట్ పెద్దగా ఉండదు. దానివల్ల ఒత్తిడి, యాంగ్జాయిటీ పెరిగే అవకాశం ఉంటుంది. పార్ట్ నర్స్ దూరంగా ఉంటారు కాబట్టి ప్రతీవారం కలవడానికి ఖరీదు ఎక్కువవుతుంది. ఇండియాలో కూడా ఇలాంటి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయట.