ఆరోగ్యం: ఎక్కిళ్ళు ఇబ్బంది పెడుతున్నాయా? ఎలా ఆపాలో తెలుసుకోండి
ఎక్కిళ్ళు వస్తే ఎవరో గుర్తు చేసుకున్నారని చెబుతారు. శరీరంలో రొమ్ముభాగాన్ని కడుపును వేరే చేసే కండరం ముడుచుకుపోయినపుడు ఎక్కిళ్ళు వస్తాయి. ఎక్కిళ్ళకు కారణాలు: ఎక్కువ సేపు నవ్వినా, కారం ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నా, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగినా, ఎక్కువ ఒత్తిడి, గాల్లోని ఉష్ణోగ్రతలు మారినా, అన్నం నమిలినప్పుడు ఎక్కువ గాలి నోట్లోకి వెళ్ళినా ఎక్కిళ్ళు వస్తాయి. ఎక్కిళ్ళను ఆపడానికి చేయాల్సిన పనులు: నీళ్ళు తాగాలి: ఇది అందరికీ తెలిసిన సాధారణ చిట్కా. ఎక్కిళ్ళను ఆపేయడానికి పనికొస్తుంది. గ్లాసు నీళ్ళు తాగితే ముడుచుకున్న కండరం తెరుచుకుని రిలీఫ్ వస్తుంది. కొందరికి గోరు వెచ్చని నీళ్ళు పనిచేస్తే మరికొందరికి చల్లని నీళ్ళు ప్రభావంవంతగా పనిచేస్తాయి.
ఎక్కిళ్ళను ఆపేసే చిట్కాలు
శ్వాస పీల్చుకోవడం ఆపివేయండి: కొన్ని సెకన్ల పాటు శ్వాస పీల్చుకోవడం ఆపితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. దీనివల్ల శరీరంలో కార్బన్ డై ఆక్సైడ్ నిల్వ ఉంటుంది. అప్పుడు ముడుచుకున్న కండరం ఫ్రీ ఐపోతుంది. 4-5 సెకన్ల వరకు శ్వాస పీల్చుకోవడం ఆపేస్తే సరిపోతుంది. నిమ్మకాయ: విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మకాయ కారణంగా ఎక్కిళ్ళు ఎటో వెళ్ళిపోతాయి. నిమ్మకాయ ముక్కను నోట్లో వేసుకుని కొరికి చూడండి. నాలుక మీద చక్కెర: 1971లో జరిపిన అధ్యయనం ప్రకారం, 20మందిలో 19మందికి చక్కెర తినడం వల్ల ఎక్కిళ్ళు తగ్గిపోయాయని తెలిసింది. ముడుచుకున్న కండరాన్ని వదులుగా మార్చడంలో చక్కెర బాగా పనిచేస్తుంది. నాలుకను బయటకు లాగండి: వినడానికి వింతగా ఉన్నా కూడా ఈ టెక్నిక్ ఎక్కిళ్ళను ఆపేస్తుంది.