జీర్ణ సమస్యలు, కండరాలు పట్టేయడం, తిమ్మిర్లను దూరం చేసే ఆహారాలు
మన శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరిగితే మనం యాక్టివ్ గా అన్ని పనులు చేసుకోగలుగుతాం. లేదంటే జీర్ణ సమస్యలు, కండరాలు పట్టేయడం, తిమ్మిరులు వంటి ఇబ్బందులు వస్తాయి. రక్తప్రసరణ సరిగ్గా జరిగితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది, మెదడు షార్ప్ గా పనిచేస్తుంది. అందుకే రక్తప్రసరణను మెరుగు పరిచే ఆహారాలను తినాలి. వెల్లుల్లి: దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తనాళాలను రిలాక్స్ చేయడంలో వెల్లుల్లి పాత్ర చాలా ఎక్కువ. అలాగే రక్త ప్రసరణకు ఎలాంటి అడ్డంకి ఏర్పడనివ్వదు. అందుకే రోజు వారి ఆహారంలో వెల్లుల్లిని ఖచ్చితంగా చేర్చుకోండి. దానిమ్మ: ఇందులోని నైట్రేట్స్, యాంటీఆక్సిడెంట్స్ కారణంగా రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది. రక్తనాళాలను విశాలం చేసి, రక్తపీడనాన్ని(బ్లడ్ ప్రెషర్) తగ్గిస్తుంది దానిమ్మ.
రక్త ప్రసరణను మెరుగుపరిచే మరిన్ని ఆహారాలు
బీట్ రూట్: ఇందులో నైట్రేట్స్ ని మన శరీరం నైట్రిక్ ఆక్సైడ్ గా మారుస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ కారణంగా రక్తనాళాల మీద ఒత్తిడి పడదు. బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. శరీర అవయవాలకు, కణజాలకు రక్తం చాలా సులభంగా ప్రవహిస్తుంది. ఒకానొక అధ్యయనం ప్రకారం, రోజూ ఉదయం బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. రక్తనాళాలు ఆరోగ్యంగా తయారవుతాయి. చాలామంది అథ్లెటిక్స్ ఛాంపియన్స్ బీట్ రూట్ జ్యూస్ తాగుతారు. పసుపు: ఇందులోని కర్క్యుమిన్ అనే పోషకం వల్ల రక్తనాళాలు విశాలంగా మారి రక్తప్రసరణ సులభంగా జరుగుతుంది. పసుపును రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన శరీరంలోని రక్తం శుద్ధి అవుతుంది దానివల్ల చర్మం అందంగా మారుతుంది.