నల్లమచ్చలు పోగొట్టడం నుండి ముడతలను దూరం చేసే వరకు చర్మానికి జిన్సెంగ్ చేసే ప్రయోజనాలు
జిన్సెంగ్ అనేది ఒక మూలిక. ఆసియా దేశాల్లో ఎక్కువగా ఉత్తర అమెరికా ప్రాంతాల్లో అక్కడక్కడా కనిపించే ఈ మూలికలో ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయి. చర్మ సంరక్షణ కోసం కొన్ని వందలయేళ్ళుగా చైనీయులు జిన్సెంగ్ ని ఉపయోగిస్తున్నారు. కొరియా దేశస్థులు కూడా చర్మ సంరక్షణ సాధనాల్లో జిన్సెంగ్ ని వాడతారు. జిన్సెంగ్ వల్ల చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. చర్మంపై గీతలను, ముడతలను దూరం చేస్తుంది వయసు పెరుగుతుంటే చర్మంపై గీతలు, ముడతలు సహజమే. కానీ జిన్సెంగ్ ని ఉపయోగించడం వల్ల చర్మ కణాల్లో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దానివల్ల చర్మంపై గీతలు, ముడతలు ఏర్పడవు. అతినీల లోహిత కిరణాల నుండి కాపాడుతుంది.
జిన్సెంగ్ వల్ల చర్మానికి కలిగే మరిన్ని ప్రయోజనాలు
మెరిసే చర్మాన్ని అందిస్తుంది చర్మం మీద నల్ల మచ్చలకు కారణమయ్యే మెలనిన్ అనే అమైనో ఆమ్లం ఉత్పత్తిని జిన్సెంగ్ తగ్గిస్తుంది. యాంటీ యాక్సిడెంట్స్ ఉండడం వల్ల శోభి మచ్చలు(హైపర్ పిగ్మెంటేషన్) రాకుండా ఉంటుంది. చర్మాన్ని వదులుగా మారనివ్వదు వయసు పెరుగుతుంటే చర్మం వదులుగా మారుతుంటుంది. అలాంటి పరిస్థితిని జిన్సెంగ్ రానివ్వకుండా చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. చర్మంపై దద్దుర్లు రాకుండా చూసుకుంటుంది సున్నితమైన చర్మం గల వారిలో చర్మం ఎర్రగా మారడం, దద్దుర్లు రావడం, దురద, మంటలు, చర్మం పగిలిపోవడం జరుగుతుంటుంది. వీటన్నింటినీ జిన్సెంగ్ దూరం చేస్తుంది. అలాగే చర్మం మీద ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి అవుతుంటే దాన్ని తగ్గించేందుకు జిన్సెంగ్ సాయపడుతుంది. ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి అయినపుడు బ్లాక్ హెడ్స్ తయారవుతుంటాయి.