చర్మం నుండి జుట్టు వరకు ఆముదం నూనె చేసే అద్భుతాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆముదం నూనెని చాలామంది మర్చిపోయారు. కానీ దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయొజనాలు తెలిస్తే మాత్రం వదిలిపెట్టరు. చర్మం సమస్యలు, జుట్టు సమస్యలను దూరం చేసే ఆముదం నూనె గురించి ఈరోజు తెలుసుకుందాం.
చర్మాన్ని తేమగా ఉంచుతుంది: రిసినోలిక్ అనే మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉండడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. కొబ్బరి నూనెలో కలుపుకుని ఆముదం నూనెను చర్మానికి మర్దన చేయాలి.
దీనివల్ల చర్మం మృదువుగా మారుతుంది. చర్మం పొడిబారడం వల్ల ఏర్పడ్డ గీతలు, చర్మంపై వచ్చిన ముడతలను మాయం చేసి చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
గాయాలు నయమయ్యేలా చేస్తుంది: చర్మంపై దద్దుర్లు రావడం, దురద, చర్మం మీద మంటగా అనిపించడం, సర్జరీ వల్ల అయిన గాయాలను ఆముదం నూనె తగ్గిస్తుంది.
ఆరోగ్యం
జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్యలను దూరం చేసే ఆముదం నూనె
జుట్టు రాలిపోవడానికి ముఖ్య కారణం తలమీద చర్మం పొడిబారిపోవడం. ఈ సమస్యను ఆముదం నూనె దూరం చేసి తలమీద చర్మాన్ని తేమగా ఉంచుతుంది. దానివల్ల వెంట్రుకలు రాలడం తగ్గిపోతుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చుండ్రును దూరం చేస్తాయి.
జీర్ణశక్తిని పెంచుతుంది: ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన దాని ప్రకారం, ఆముదం నూనెలోని పోషకాలు పేగుల కదలికను చురుగ్గా ఉంచడంలో సాయపడతాయి. దానివల్ల జీర్ణాశయ పనితీరు మెరుగవుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: తెల్లరక్త కణాలను పెంచే పోషకాలు ఆముదం నూనెలో ఉంటాయి. దానివల్ల రోగాలతో పోరాడే శక్తి శరీర కణాలకు పెరుగుతుంది. అందుకే ఆముదం నూనెను మీ రోజువారి జీవితంలో ఉపయోగించడం అలవాటు చేసుకోండి.