చర్మ సంరక్షణ: 20ఏళ్ళ వయసులో 40ఏళ్ల వాళ్ళలా కనిపిస్తుంటే మానుకోవాల్సిన అలవాట్లు
మీ నిజమైన వయసు కన్నా మీ చర్మం వయసు ఎక్కువగా కనిపిస్తుంటే మీరు పాటిస్తున్న అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే చర్మం వయసు పెరిగిపోయి మీలో ఉత్సాహం తగ్గిపోతుంది. మరి ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. ప్రాసెస్ చేసిన ఆహారాలను ముట్టుకోవద్దు: ఈ ఆహారాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని వీటిలో రసాయనాలను కలుపుతారు. వాటివల్ల రక్తంలో చక్కెర శాతం పెరిగి, చర్మానికి కావాల్సిన కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. కావాల్సినంత నిద్రపోవాలి: మనం నిద్రపోయే సమయంలో చర్మ కణాలు రిపేరు అవుతుంటాయి. నిద్ర సరిగ్గా లేకపోతే చర్మ కణాలు రిపేర్ అవకుండా అలాగే ఉండిపోతాయి. అందుకే కావాల్సినంత నిద్ర ఖచ్చితంగా అవసరం.
చర్మం వయసును పెంచే డిజిటల్ వస్తువులు
డిజిటల్ వస్తువులు: స్క్రీన్ టైమ్ శృతి మించడం వల్ల కళ్ళు అలసిపోతాయి. కంటికి రెస్ట్ లేకపోతే నిద్రపట్టదు. దాంతో కొల్లాజెన్ ఉత్పత్తి అవదు. చనిపోయిన చర్మకణాలు చర్మం మీదే ఉండిపోతాయి. కావాల్సినన్ని నీళ్ళు తాగాలి: శరీరంలోని కణాలు సక్రమంగా పనిచేయాలంటే తగినన్ని నీళ్ళు తప్పకుండా తాగాలి. నీళ్లు తాగకపోవడం వల్ల చర్మం మీద ఉండే తేమ ఆవిరై చర్మం పొడిబారుతుంది. అంతేకాదు నీళ్ళు తాగకపోతే మీరు యాక్టివ్ గా ఉండలేరు. వ్యాయామం చేయాలి: అసలు వ్యాయామం లేకుండా బద్దకంగా జీవితాన్ని గడపడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దానివల్ల శరీర భాగాలకు ఆక్సిజర్ సరఫరా బాగుంటుంది. రక్తప్రసరణ సరిగ్గా లేకపోతే చర్మం వయసు పెరుగుతుంటుంది.