శరీరం: సరిగ్గా నిలబడలేక వంగిపోతున్నారా? సింపుల్ ఎక్సర్ సైజెస్ ట్రై చేయండి
ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్స్, లాప్ట్ ట్యాప్ లు వాడకుండా ఉండలేకపోతున్నారు. దానివల్ల శరీర ఆకారం వంగిపోతుంది. అది క్రమంగా వెన్నెముక సమస్యలకు దారి తీస్తుంది. శరీరం వంగిపోవడం వల్ల చూడడానికి కూడా ఆకర్షణీయంగా కనిపించరు. మరి శరీరం వంగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడూ తెలుసుకుందాం. దీనికోసం శరీరాన్ని అటూ ఇటూ వంచాల్సి ఉంటుంది. చైల్డ్ పోజ్: మోకాళ్ల మీద కూర్చుని, మోకాలికి మోకాలికి మధ్య అడుగులో సగం స్థలం ఉండేలా చూసుకుని, ఆ గ్యాప్ లో మీ బాడీ ఇరుక్కుపోయేట్టుగా పూర్తిగా వంగాలి. చేతులను మీ తలతో పాటుగా నేలమీద ఆనించాలి. అరిచేతులు భూమిని తాకాలి. మీ నుదురుకు భూమిని తాకలేకపోతే ఏదైనా ఎత్తుగా ఉన్న పుస్తకాన్ని తలకింద పెట్టుకోవచ్చు.
శరీరాన్ని వంచే మరిన్ని వ్యాయామాలు
భుజంగాసనం: నేలమీద బోర్లా పడుకుని రెండు చేతులను తలపక్కన ఆనించి నడుము భాగం వరకు శరీరాన్ని పైకి లేపాలి. ఇలా నిమిషం సేపు ఉండాలి. ఒకరోజులో ఐదు సార్లు చేయాలి. ఛాతిని విరవండి: నిటారుగా నిలబడి చేతులను పిరుదుల మీద ఉంచి కేవలం ఛాతిని మాత్రమే ముందుకు విరవండి. సౌకర్యాన్ని బట్టి ఎంతసేపైనా ఉండవచ్చు. వెనక్కి వంగండి: సాధారణంగా ఎక్కువగా జనాలందరూ ముందుకే వంగుతారు. కానీ ఈ ఎక్సర్ సైజ్ లో వెనక్కి వంగాలి. నిటారుగా నిలబడి రెండు చేతులను పైకి లేపి చేతివేళ్లను లాక్ చేసి వెనక్కి వంగండి. ఈ వ్యాయామాలను వీలున్న సమయంలో ఎప్పుడైనా చేయవచ్చు. దీనివల్ల మీ శరీరం వంగిపోకుండా నిటారుగా ఉంటుంది. వెన్నెముక సమస్యలు రాకుండా ఉంటాయి.