వెరికోస్ వెయిన్స్ లేదా ఉబ్బు నరాలు తగ్గిపోవాలంటే చేయాల్సిన యోగాసనాలు
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నరాలు ఉబ్బినట్టుగా మారతాయి. ఆ పరిస్థితినే వెరికోస్ వెయిన్స్ అంటారు. ఎక్కువశాతం కాళ్లలోని నరాలు ఉబ్బిపోయి ఈ పరిస్థితి ఎదురవుతుంది. దీన్ని తగ్గించుకోవడానికి యోగాసనాలు బాగా పనికొస్తాయి. తాడాసనం: తాడా అంటే పర్వతమని అర్థం. ముందుగా నిటారుగా నిల్చుని చేతులను ముందుకు చాపి, రెండుచేతుల వేళ్ళను కలిపేసి అరచేతులు అవతలి వైపు చూపించే విధంగా చేసి, అలానే చేతులను ఆకాశంవైపు నిటారుగా ఎత్తాలి. ఆ తర్వాత కాలి మడమలను పైకి లేపి కేవలం వేళ్ళమీద మాత్రమే నిలబడాలి. ఇలా చేసినపుడు గాలిని పీల్చుకోవాలి. 10-15సెకన్లు ఇలా నిల్చున్న తర్వాత మడమలను నేలమీద ఆనించి గాలిని వదలాలి. ఇలా రోజుకు 6సార్లు చేస్తే ఉబ్బునరాలు మాయమవుతాయి.
ఉబ్బు నరాలను తగ్గించే యొగాసనాలు
బాలాసనం: ముందుగా మోకాళ్ల కూర్చుని, పిరుదులను కాలి మడమలకు ఆనించి రిలాక్స్ అవ్వాలి. తర్వాత, తొడలకు ఛాతి భాగం తాకేలా ముందుకు వంగాలి. చేతులను తలతో పాటు సమానంగా ముందుకు చాచాలి. 3-5నిమిషాలు చేయాలి. మత్స్యాసనం: పద్మాసనంలో కూర్చుని, చేతులతో కాలిబొటన వేలును పట్టుకుని అలానే వెనక్కి వంగాలి. నేలకు తలను ఆనించిన తర్వాత నడుము భాగాన్ని ఆకాశంవైపు విరవాలి. మీ నడుము వంగినట్టుగా కనిపించాలి. ఇలా 30సెకన్లు ఉండాలి. సేతుబంధ సర్వాంగాసనం: వెల్లకిలా పడుకుని మోకాళ్లని వంచి, మడమలను శరీరం వైపు లాగాలి. చేతులను శరీరం పక్కన ఉంచి, నడుమును, తొడలకు పైకి లేపాలి. ఇప్పుడు మీ చేతులతో కాలిమడమలను పట్టుకోవాలి. నిమిషం పాటు ఇలా ఆసనంలో ఉంటే చాలు.