ఒత్తిడిని దూరం చేయడం నుండి సంతాన ప్రాప్తి వరకు శిలాజిత్ వల్ల కలిగే ప్రయోజనాలు
శిలాజిత్.. ఇది హిమాలయ కొండల్లో దొరికే ఆహార పదార్థం. ఎన్నో ఏళ్ళ క్రితం కుళ్ళిపోయిన మొక్కల వల్ల ఇది తయారైంది. పుష్కలమైన పోషకాలు ఉండే శిలాజిత్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శిలాజిత్ ని పొడిరూపంలో, టాబ్లెట్ల రూపంలో, సిరప్ రూపంలో తీసుకోవచ్చు. ఒకరోజులో 300-500మిల్లీగ్రాముల డోస్ తీసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం శిలాజిత్ వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం. ఒత్తిడి తగ్గిస్తుంది: ఆలోచనలు ఒకే దగ్గర ఆగిపోయినపుడూ ఒత్తిడి ఎక్కువవుతుంది. శిలాజిత్ వల్ల ఆలోచనా శక్తి పెరిగి ఒత్తిడి, యాంగ్జాయిటీ దూరమవుతుంది. శిలాజిత్ వల్ల డోపమైన్, సెరెటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్లను విడుదలవుతాయి. దీనికి కారణం శిలాజిత్ లో మెగ్నీషియం, పొటాషియం వంటి శరీరాన్ని విశ్రాంతపరిచే పోషకాలు ఉండడమే.
పురుషుల్లో టెస్టోస్టిరాన్ పెంచే పోషకాల శిలాజిత్
సంతాన ప్రాప్తిని పెంచుతుంది: పురుషులో టెస్టోస్టిరాన్ హార్మోన్ ని పెంచడానికి కొన్ని వందల సంవత్సరాల నుండి శిలాజిత్ ని ఉపయోగిస్తున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం పురుషుల్లో వీర్యకణాల పెరుగుదుల శిలాజిత్ వల్ల కలిగిందని తేలింది. 45-55ఏళ్ళ పురుషులు 90రోజుల పాటు శిలాజిత్ ని తీసుకోవడం వల్ల టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరిగినట్లు కనుకొన్నారు. యవ్వనంగా ఉంచుతుంది: శిలాజిత్ లోని యాంటీ యాక్సిడెంట్లు శరీర కణాలు తొందరగా పాడవకుండా కాపాడతాయి. దానివల్ల యవ్వనం ఎక్కువ రోజులు ఉంటుంది. అంతేకాదు శరీరంలోని విషపదార్థాలను బయటకు వెళ్ళేలా చేస్తుంది శిలాజిత్. రక్తహీనతను దూరం చేస్తుంది: కొన్నిరోజుల పాటు కొంత శిలాజిత్ ని తీసుకోవడం వల్ల ఐరన్, హిమోగ్లోబిన్ లోపం తగ్గిపోయి రక్తహీనత దూరమవుతుంది.