ఆయుర్వేద పదార్థాలతో చర్మాన్ని సురక్షితంగా ఉంచుకునే మార్గాలు
చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో రకరకాల సాధనాలు ఉన్నాయి. మొటిమలు పోగొట్టడానికి, చర్మం మీద ఏర్పడ్డ నల్లమచ్చలను దూరం చేయడానికి రకరకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఆ వస్తువులన్నీ ఒక్కొక్కరిపై ఒక్కో విధంగా పనిచేస్తాయి. వాటన్నింటినీ పక్కన పెడితే ఆయుర్వేద పదార్థాలతో చర్మాన్ని సురక్షితంగా ఎలా ఉంచుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. పీహెచ్ స్థాయిలను సరిగ్గా ఉంచుకోవాలి: చర్మం పీహెచ్ విలువలు మారడం వల్ల చర్మంలో అనేక మార్పులు వస్తాయి. చర్మం పీహెచ్ విలువలను సమానంగా ఉంచేందుకు కలబంద రసం బాగా పనిచేస్తుంది. శోభి మచ్చలను దూరం చేసే పండ్లు: చెరుకు, ద్రాక్ష వంటి పండ్ల నుండి వచ్చే ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు చర్మం మీద ఏర్పడే శోభి మచ్చలను దూరం చేయడంలో సాయపడతాయి.
చర్మ సంరక్షణకు ఉపయోగపడే మరిన్ని ఆయుర్వేద పదార్థాలు
మొటిమలను దూరం చేసే పుల్లటి పండ్లు: ఫైనాఫిల్, నారింజ, టమాట, వెల్లుల్లి లో ఉండే బీటా హైడ్రాక్సీ ఆమ్లాల వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. బ్లాక్ హెడ్స్ రాకుండా ఉంటాయి. వయసు తగ్గించే ఆహారాలు: చర్మ వయసుకు తగ్గించేందుకు ఆహారాల్లోని ప్రో బయోటిక్స్ ఉపయోగపడతాయి. ప్రో బయోటిక్స్ ఉన్న ఆహారాలైన ఫైనాపిల్, ఆపిల్, బొప్పాయి, పెరుగు తినడం వల్ల చర్మం యవ్వనంగా ఉండడమే కాకుండా మెరిసే గుణాన్ని సంతరించుకుంటుంది. ఆరోగ్యమైన చర్మం కోసం ప్రీ బయోటిక్స్: ఈ ప్రీ బయోటిక్స్ అనేవి ఆకు కూరలు, ఆయుర్వేద మూలికలు, డ్రై ఫ్రూట్స్, విత్తనాల్లో ఉంటాయి. వీటిని ఆహారాల్లో తీసుకోవడం వల్ల చర్మానికి ప్రీ బయోటిక్స్ అందుతాయి. దానివల్ల చర్మం చాలా తాజాగా, మృదువుగా కనిపిస్తుంది.